Begin typing your search above and press return to search.
నెటిజన్ల ఎఫెక్ట్: దిగివస్తున్న ప్రధాని మోడీ!
By: Tupaki Desk | 29 April 2021 10:34 AM GMTదేశంలో కరోనా తీవ్రత ప్రపంచ స్థాయిలో అందరినీ కలవరపెడుతోంది. ఇప్పటి వరకు తనకు మించిన ప్రజానేత లేరని పదే పదే చెప్పుకొన్న ప్రధాని మోడీని ప్రపంచం నేడు వేలెత్తి చూపించే పరిస్థితి వచ్చింది. జాతీయ మీడియా ఎలా ఉన్నప్పటికీ.. ప్రపంచ మీడియా మాత్రం దుమ్ము దులిపేస్తోంది. ఇక, మోడీ చర్యలతో దేశంలో కరోనా కేసులుపెరిగాయని. ఆయన రిజైన్ చేయాలని నెటిజన్లు పెద్ద ఎత్తున డిమాండ్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇంటా బయటా కూడా మోడీకి సెగ తగులుతోంది. కరోనా నియంత్రణలోనే కాకుండా.. కరోనాను నియంత్రించే ఔషధాల విక్రయం విషయంలోనూ మోడీ అనుసరిస్తున్న తీరును ప్రతి ఒక్కరూ తప్పుపడుతున్నారు.
ఇక, ప్రజల ఆరోగ్యాన్ని, వారి ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకున్న సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఐఐ) కూడా కొవిడ్-19 వ్యాక్సిన్ కొవిషీల్డ్ ధరలను తగ్గించింది. రాష్ట్రాలకు విక్రయించే టీకా ఒక్కో డోసు ధరను రూ.400 నుంచి రూ.300కు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఎస్‌ఐఐ సీఈఓ అదర్ పూనావాలా ట్విటర్ ద్వారా ప్రకటన చేశారు. తగ్గించిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయం మూలంగా రాష్ట్రాలకు వేల కోట్ల రూపాయలు ఆదా అవుతాయన్నారు. అంతేకాకుండా ఎక్కువ మంది వ్యాక్సిన్ వేయించుకునేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందన్నారు.
కాగా.. రాష్ట్రాల నుంచి 34 కోట్ల వ్యాక్సిన్ డోసులకు, ప్రైవేటు ఆస్పత్రుల నుంచి 2 కోట్ల డోసులకు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆర్డర్లు పొందినట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే.. టీకా ఉత్పత్తి సంస్థే.. ధరలను తగ్గించిన నేపథ్యంలో మోడీ సర్కారుకు మరింత సెగ పెరగడం ఖాయమని విశ్లేషణలు ఊపందుకున్నాయి. అంటే.. టీకాపై ప్రభుత్వం జీఎస్టీ విధిస్తోంది. ఇది 18 శాతం పరిధిలో ఉంది. ఈ క్రమంలో సీరం టీకా ధరపై మరికొంత భారం ప్రజలపై పడి.. అది మోడీ ప్రభుత్వ ఖాతాలోకి చేరుతుంది. ఈ నేపథ్యంలో అత్యంత కీలకమైన సమయంలో జీఎస్టీని మినహాయించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఈ పరిస్థితిని సమీక్షించిన ప్రధాని నరేంద్ర మోడీ.. కరోనా వ్యాక్సిన్ సహా రెమెడిసివర్ ఇంజన్లపై జీఎస్టీ తగ్గించేందుకు యోచిస్తున్నట్టు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ ఇంజక్షన్లు,టీకా కూడా మరింతగా తక్కువ ధరకు ప్రజలకు అందుబాటులోకి రానుంది. అయితే.. ఇంకా దీనిపై నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం. మరి మోడీ దిగి వచ్చి ప్రజలపై భారం తగ్గిస్తారో లేదో చూడాలి.