Begin typing your search above and press return to search.

నరేంద్ర మోడీ.. గుజరాత్ కే ప్రధానమంత్రా?

By:  Tupaki Desk   |   20 May 2021 4:30 AM GMT
నరేంద్ర మోడీ.. గుజరాత్ కే ప్రధానమంత్రా?
X
అరేబియా స‌ముద్రంలో ఏర్ప‌డిన తౌక్తే తుఫాను.. తీర ప్రాంతంలోని నాలుగు రాష్ట్రాల‌పై తీవ్ర ప్ర‌భావం చూపింది. ఈ నెల 18న‌ తీరం దాటిన ఈ సైక్లోన్.. దాదాపు మూడ్నాలుగు రోజులు బీభ‌త్సం సృష్టించింది. ఈ తుఫాను ధాటికి మ‌హారాష్ట్ర‌, క‌ర్నాట‌క‌, గుజ‌రాత్‌, గోవా రాష్ట్రాలు వ‌ణికిపోయాయి. ప్రాణ న‌ష్టంతోపాటు భారీగా ఆస్తిన‌ష్టం సంభ‌వించింది.

జ‌నావాసాల్లో వంద‌లాది చెట్లు నేల‌కూల‌డంతోపాటు ప‌లు చోట్ల ఇళ్లు కూడా దెబ్బ‌తిన్నాయి. పంట‌లు స‌ర్వ‌నాశనం అయ్యాయి. విద్యుత్ స‌ర‌ఫ‌రా చాలా ప్రాంతాల్లో స్తంభించిపోయింది. జ‌రిగిన న‌ష్టాన్ని పూడ్చుకోవ‌డానికి ప్ర‌భుత్వాల‌పై చాలా భారం ప‌డే ప‌రిస్థితి. ఇప్ప‌టికే.. కొవిడ్ నేప‌థ్యంలో అవ‌స్థ‌లు ప‌డుతున్న రాష్ట్రాల‌కు.. ఇది మ‌రింత‌ భారాన్ని మోసుకొచ్చినట్టైంది.

అయితే.. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఆయ‌న సొంత రాష్ట్రం గుజ‌రాత్ భారీగా ప‌రిహారం ప్ర‌క‌టించిన‌ట్టు స‌మాచారం. 1,000 కోట్ల రూపాయ‌లు కేటాయిస్తూ నిర్ణ‌యం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఇత‌ర రాష్ట్రాలు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నాయి. మ‌హారాష్ట్ర‌లో శివ‌సేన‌, ఎన్సీపీ నేత‌లు భ‌గ్గుమ‌న్నాయ‌ని స‌మాచారం.

తుఫాను ధాటికి కేవ‌లం గుజ‌రాత్ మాత్ర‌మే న‌ష్ట‌పోయిందా? మ‌హారాష్ట్ర తీవ్రంగా దెబ్బ‌తిన్న‌దని ఆవేద‌న వ్య‌క్తంచేసిన‌ట్టు తెలుస్తోంది.. ఇలాంటి స‌మ‌యంలో అన్ని రాష్ట్రాల‌ను స‌మానంగా చూడాల్సిన మోడీ.. కేవ‌లం గుజ‌రాత్ కే ప‌రిహారం ప్ర‌క‌టించ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు స‌మాచారం. న‌రేంద్ర మోడీ కేవ‌లం గుజ‌రాత్ కే ప్ర‌ధాన‌మంత్రా? అన్న నేత‌లు.. ఇది వివ‌క్షకాక మ‌రేమిట‌ని నిల‌దీసిన‌ట్టు తెలుస్తోంది.