Begin typing your search above and press return to search.
మోడీ ఎంత పోటుగాడో తెలుసా? ఈ లెక్క చూస్తే ముక్కున వేలేసుకోవాలి
By: Tupaki Desk | 8 Jun 2021 3:31 AM GMTసామాన్యులకు తరచూ ఒక సందేహం వస్తుంటుంది. ప్రజల్లో ఉండే వ్యతిరేకత పాలకులకు ఎందుకు కనిపించదు? సగటు జీవి కంటే ఎంతో ఎక్కువ తెలివి.. అంతకు మించిన మేధస్సు ఉన్న వారు పాలకులుగా ఉన్నప్పుడు.. సామాన్య ప్రజల భావోద్వేగాల్ని.. వారి వ్యతిరేకతను గుర్తిస్తే.. మరింతకాలం అధికారంలోకి ఉండే వీలు ఉంటుంది కదా? అనుకుంటారు. కానీ.. అధికారంలో ఉన్న వారి చుట్టూ ఉండే వారంతా.. వారిని ఒకలాంటి భ్రాంతిలో ఉంచేస్తారని చెప్పాలి. మిగిలిన వారి కంటే ఎంత మెరుగైన పాలనను అందిస్తున్నామో తెలుసా? అంటూ లెక్కలతో బోల్తా కొట్టిస్తుంటారు.
కరోనా సెకండ్ వేవ్ ఎపిసోడ్ తో పాటు వ్యాక్సినేషన్ విషయంలో మోడీ సర్కారు అట్టర్ ప్లాప్ అయ్యిందన్న మాట బలంగా వినిపిస్తున్న వేళ.. మోడీ ఎంత మొనగాడో తెలుసా? ఆయన పాలన ఎంతోమంది పోటుగాళ్లకు మించిందంటూ చెప్పే లెక్కలు చూస్తే అవాక్కు అవ్వాల్సిందే. నిజానికి ఇలాంటి వాదనే ప్రభుత్వాల్ని ప్రజలకు దూరమయ్యేలా చేయటమే కాదు..పవర్ కోల్పోయేలా చేస్తుందని చెప్పాలి.
తాజాగా వైరల్ అవుతున్న పోస్టు చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. ప్రపంచంలోని 87 దేశాల ప్రధానమంత్రులతో పోలిస్తే.. మోడీ ఎంత మొనగాడు అన్న పోలికను చూపించేలా ఈ పోస్టును సిద్ధం చేశారు. దేశ జనాభా 139 కోట్లు కాగా.. తమ లెక్కలకు సరిపోయేలా 137 కోట్ల మంది జనాభా ఎన్ని దేశాల్లో ఉంటారో లెక్క కట్టి 87 దేశాలుగా చూపించారు.
87 దేశాలు వర్సెస్ భారత్ ఒక్కటన్న లెక్కను చూపిస్తే.. ఆ దేశాల కంటే మోడీ ఎంత మెరుగైన నాయకుడో తెలుసా? అంటూ చూపించిన లెక్కలో 87 దేశాల్లో 8.41 కోట్ల కేసులు నమోదైతే.. ఇండియాలో మాత్రం 2.18 కోట్ల కేసులే నమోదయ్యాయని.. యూరోప్.. నార్త్ అమెరికాలో మొత్తం 19 లక్షల మంది కరోనా కారణంగా మరణిస్తే.. భారత్ లో మాత్రం 2.38 లక్షల మంది మరణించినట్లుగా లెక్కలు చూపించారు.
ఇదంతా చూపించి.. చూశారా 87 దేశాల ప్రధానమంత్రులతో పోలిస్తే.. మోడీ ఎంత మొనగాడో అంటూ ముగించారు. అంతా బాగుంది కానీ.. 87 దేశాలు ఎందుకు? చైనా వర్సెస్ భారత్ లెక్క పోలిస్తే బాగుంటుంది కదా? మోడీ ఎంత మొనగాడైన పాలకుడన్న విషయం అర్థమవుతుంది కదా? మరీ మోడీ భక్తులు ఆ లెక్కలు కూడా చూపిస్తారా? నిజానికి ఇలాంటి లెక్కలే చూపించి మోడీ లాంటి నేతను బ్రహ్మాండంగా పని చేస్తున్నామన్న మత్తులో ఉంచుతారా? అన్న సందేహం కలుగక మానదు.