Begin typing your search above and press return to search.

కత్తి మహేశ్ లో ఉన్నది.. పోసానిలో మిస్ అయినది ఇదే

By:  Tupaki Desk   |   29 Sep 2021 6:40 AM GMT
కత్తి మహేశ్ లో ఉన్నది.. పోసానిలో మిస్ అయినది ఇదే
X
భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటే బలప్రదర్శనకు సరిపోయేది. కానీ.. ఇప్పుడు రోజులు మారాయి. బలప్రదర్శనకు కొత్త కొత్త వేదికలు వచ్చాయి. కోట్లాది మంది అభిమానులుఉన్నా.. వారందరికి ఉలిక్కిపడేలా చేసి.. వారి చేత తప్పులు చేయించి.. ఆ తప్పులు మొత్తం తాము టార్గెట్ చేసే వారి ఖాతాలోకి వేసే సరికొత్త అస్త్రంగా కొందరిని సిద్ధం చేసుకుంటున్నాయి రాజకీయ పార్టీలు. ఆ కోవలోకే వస్తారు కత్తి మహేశ్.. పోసాని క్రిష్ణమురళీ.. శ్రీరెడ్డి.. దిలీప్ సుంకర తదితరులు.

ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే.. రాజకీయాలకు సంబంధించి తమకు తాము తోపులగా అభివర్ణించే తెలుగుదేశం పార్టీకి.. పేరున్న ఇలాంటి అస్త్రాలు ఎక్కడా కనిపించరు.

వీరి కారణంగా.. కొత్త తరహా వాదనల్ని వినిపిస్తూ ఉంటారు. క్రియాశీలక రాజకీయాల్లో కనిపించని వీరు.. ఎవరికి వారు తమకు తగిన ప్రొఫెషన్ లో ఉంటూ.. తమ వాదనను సగటు అభిమానిగా.. విమర్శకుడిగా.. ఇంకా ఏదో ఒక తోకను తగిలించుకొని తమ టార్గెట్లను చేధిస్తుంటారు. పవన్ కల్యాణ్ మీద మొదట్నించి వ్యూహాత్మకంగా.. .కొత్త తరహాలో విమర్శల దాడి జరగటం తెలిసిందే.

ఆ మాటకు వస్తే.. సినిమాల్లో వచ్చిన కొత్తల్లో.. స్టార్ డమ్ వస్తున్నవేళ.. పవన్ మీద మిగిలిన వారికి కాస్త డిఫరెంట్.. అంటూ మీడియాలో సన్నాయి నొక్కులు నొక్కేవారు. అయితే.. పవన్ పీఆర్ టీం బలంగా లేకపోవటం.. ఏదైనా సరే సూటిగానే తప్పించి.. లోపాయికారీగా వ్యవహరించటం చేతకాకపోవటంతో.. ఆయన ఇమేజ్ ను అభిమానులే బిల్డ్ చేశారే తప్పించి.. మీడియా కానీ మరే ఇతర శక్తులు కానీ చేసింది లేదు.

కానీ.. ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేసే విషయంలో మాత్రం కొందరు కీలకభూమిక పోషించారని చెప్పాలి. ఈ జాబితాలో మహేశ్ కత్తి కూడా ఉంటారు. పవన్ ను అభిమానించే వారికి ఏ మాత్రంనచ్చని రీతిలో.. .ఆయన అభిమానుల పేరుతో పవన్ ఇమేజ్ ను ప్రశ్నించటం.. కొత్త తరహా వాదనను వినిపిస్తూ ఉండేవారు. కత్తి మహేశ్ మాటల్ని విన్నంతనే సగటు అభిమానికి కోపం కలిగించేలా ఉన్నా.. ఆయన ఎప్పుడు గీత దాటింది లేదు. హద్దులు చెరిపేసింది లేదు.

అందుకు భిన్నంగా తాజగా పోసాని మాత్రం అన్ని గీతల్ని.. హద్దుల్ని దాటేశారని చెప్పాలి. రాయలేని.. వాడలేని బూతుల్ని ప్రయోగించటమేకాదు.. పవన్ మీద కోపంతో.. పవన్ తల్లిని.. పెళ్లాన్ని కూడా వదిలిపెట్టనంటూ ఆయన అనేసిన మాటల పైత్యం చూసినోళ్లంతా మండిపడుతున్నారు. ఈ కారణంతోనే పవన్ మీద ఎంతఅభిమానం ఉన్నా కత్తి మహశ్ చేసే విమర్శల్ని చూసి చూడనట్లుగా ఉన్నవారు సైతం.. పోసాని మాటల్ని మాత్రం సీరియస్ గా తీసుకుంటున్నారని చెప్పక తప్పదు.