Begin typing your search above and press return to search.
మోడీ ఏమైనా కర్ణుడా.. పిల్లాడిలా మాట్లాడతారేంటి పీకే?
By: Tupaki Desk | 31 May 2021 3:30 PM GMTరాష్ట్రం ఏదైనా కానీ.. తాను ఎంట్రీ ఇచ్చి.. వ్యూహాల్ని సిద్ధం చేసిన తర్వాత తనను ఎంపిక చేసిన అధినేతను రాష్ట్రాధినేతగా ఎంపిక చేసే వరకు నిద్రపోని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. ఈ సేవల్ని అందించేవారు దేశంలో చాలామంది ఉన్నా.. ప్రశాంత్ కిశోర్ అనబడే పీకే టాలెంట్ కాస్త భిన్నమని చెప్పాలి. ఎంత వ్యతిరేక గాలి వీస్తున్నా.. దాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవటం.. తనను ఎంపిక చేసుకున్నక్లయింట్ కు నూటికి నూరు శాతం న్యాయం చేసే తీరు ఆయన సొంతం. అలాంటి ఆయనకు ఈ మధ్య కాలంలో ప్రధాని మోడీ అస్సలు నచ్చట్లేదు.
తాజాగా మోడీ తీసుకున్న నిర్ణయాలపై ఆయన మండిపడ్డారు. కరోనాతో తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లలకు సాయం అవసరమైన వేళ.. మోడీ సర్కారు కేవలం హామీతో సరిపుచ్చిదంటూ ఆయన మండిపడ్డారు. మోడీ సర్కారు మరో మాస్టర్ స్ట్రోక్ ఇది.. కరోనా వల్ల అనాథలైన పిల్లల్ని ఆదుకోవటంలోఅసమర్థత.. ఇప్పుడు వారు తమకు అత్యంత అవసరమైన సాయాన్ని అందుకోవటానికి బదులు.. పద్దెనిమిదేళ్ల తర్వా స్టైఫండ్ అందుకతుందేనే హామీ గురించి పాజిటివ్ గా ఫీల్ కావాలి అని ట్వీట్ చేశారు.
మోడీ ఇచ్చిన వరానికి ‘కృతజ్ఞత కలిగి ఉండండి’ అంటూ వ్యంగ్య వ్యాఖ్య చేసిన పీకే.. సెకండ్ వేవ్ లో దేశ వ్యాప్తంగా తల్లిదండ్రుల్ని కోల్పోయిన చిన్నారులను ఆదుకునేందుకు ప్యాకేజీ ప్రకటించటం.. దానిపై పెద్ద ఎత్తున పెదవి విరుపు వినిపించింది. ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని మరో ప్రభుత్వం అమలు చేయని వేళ.. కరోనా కారణంగా తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లలకు వారు తమ 23 ఏట ప్రభుత్వ సాయాన్ని అందుకునే అర్హత లభిస్తుందని మోడీ చెప్పారు.
అందుకు బదులుగా.. కేంద్రం ఇవ్వాల్సిన మొత్తాన్ని ఆయా పిల్లల పేరుతో బ్యాంక్ అకౌంట్లు తెరిచేసి.. అందులో వేసి.. ఆ పిల్లలు 18 ఏళ్లు వచ్చిన తర్వాత నెల వారీగా సాయాన్ని కొంత ఫిక్స్ చేయటం.. 23 ఏళ్ల తర్వాత బ్యాంకులో ఉన్న మొత్తాన్ని తమ అవసరాలకు వాడుకునేలా ఏర్పాటు చేస్తే బాగుండేది. అదే సమయంలో.. ఇప్పటికిప్పుడు జరిగిన నష్టానికి కొంత ఆర్థిక సాయాన్ని ప్రకటించి ఉంటే.. తల్లిదండ్రుల్ని కోల్పోయిన కొరత కొంత మేర తగ్గే అవకాశం ఉండేది. కానీ.. అదేమీ చేయకుండా తన తీరుకు తగ్గట్లు.. అప్పుడెప్పుడో అందించే సాయం గురించి ఇప్పుడు ఘనంగా ప్రకటనలు చేయటాన్ని పలువురు తప్పు పడుతున్నారు.
నిజానికి ప్రధాని మోడీ ఎవరికి ఎలాంటి సాయాన్ని ప్రకటించినా.. అందులో ఏదో ఒక మతలబు ఉంటుందన్న మాట వినిపిస్తూఉంటుంది. విపత్తుల వేళ.. రాష్ట్రాలకు ప్రకటించే సాయాన్ని కేంద్రం నుంచి తీసుకోవటానికి కొర్రీల మీద కొర్రీలు పెట్టటమేకాదు.. చుక్కలు కనిపించేలా చేస్తారన్న పేరుంది. ఇన్ని తెలిసిన తర్వాత కూడా ఏమీ తెలియని పిల్లాడి మాదిరి మోడీని తిట్టేయటం ఏమిటి పీకే? అయినా.. మోడీ ఏమైనా దాన కర్ణుడా.. నిండు మనసుతో కష్టంలో ఉన్న వారిని ఆదుకునేందుకు స్పందిస్తారనటానికి. ఏడేళ్ల నుంచి చూసిన తర్వాత కూడా మోడీ నుంచి ఏదో ఆశించటం అత్యాశే అవుతుంది.