Begin typing your search above and press return to search.

అందులో కోహ్లీ బ్యాడ్ లక్ ఎంత ఎక్కువంటే?

By:  Tupaki Desk   |   29 March 2021 11:30 AM GMT
అందులో కోహ్లీ బ్యాడ్ లక్  ఎంత ఎక్కువంటే?
X
బ్యాట్ పట్టుకొని క్రీజ్ లోకి ఎంట్రీ ఇచ్చాక.. కోహ్లీ ఎంతలా చెలరేగిపోతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీమిండియా కెప్టెన్ గా అతడి ట్రాక్ రికార్డు మెరుగ్గానే ఉంటుంది. కాస్త కోపం తప్పించి.. మిగిలిన విషయాల్లో అతని వ్యవహారశైలిని తప్పు పట్టలేం. అంతా బాగున్నా.. ఒక్క విషయంలో విరాట్ కోహ్లీ ట్రాక్ రికార్డు దారుణంగా ఉండటమే కాదు.. అతనెంత ప్రయత్నించినా.. అతన్ని పట్టిన బ్యాడ్ లక్ విడిచి పెట్టటం లేదని చెబుతారు. ఇంతకీ.. అదే విషయంలో అంటారా? మ్యాచ్ ఆరంభానికి ముందు కెప్టెన్లు ఇద్దరు వేసే టాస్ విషయంలో.

తాజాగా పూర్తైన ఇంగ్లండ్ సిరీస్ సంగతే చూస్తే.. మొత్తం 12 సార్లు టాస్ వేస్తే.. రెండు సార్లు మాత్రమే కోహ్లీ పక్షాన నిలిస్తే.. పదిసార్లు అతనికి వ్యతిరేకమైన ఫలితమే వచ్చింది. ఒక్క ఇంగ్లంగ్ లో అతను అన్ని ఫార్మాట్ లలో కలిసి ఇప్పటివరకు 35 సార్లు టాస్ వేస్తే.. కేవలం ఎనిమిది సార్లు మాత్రమే విజయం సాధించాడు. టాస్ బ్యాడ్ లక్ ఒక్క ఇంగ్లండ్ జట్టు మీదనే కాదు.. ఏ జట్టుతో అయినా సరే.. కోహ్లీకి టాస్ అచ్చి రాదని చెబుతారు.

మాటలే కాదు.. గణాంకాలు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుంటాయి. 200 అంతర్జాతీయ మ్యాచుల్లో టీమిండియాకు విరాట్ కోహ్లీ సారథ్యం వహిస్తే.. 115 సార్లు టాస్ ఓడగా.. 85 సార్లు మాత్రమే అతను నెగ్గటం గమనార్హం. అతని కెరీర్ లో టాస్ గెలుపు కేవలం 45 శాతం మాత్రమే. టాస్ విషయంలో మిగిలిన అంతర్జాతీయ కెప్టెన్లలో కోహ్లీ స్థానం చివరగా ఉండటం విశేషం.

కోహ్లీ మాదిరే దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్ డుప్లెసిస్ ఎంతకూ టాస్ తనకు కలిసి రాకపోవటంతో.. ఒక మ్యాచ్ం లో తన సహచర ఆటగాడు డుమినితో టాస్ వేయించి నెగ్గాడు. కోహ్లీ కూడా ఇప్పుడు అలానే చేయాల్సి ఉంటుందన్న మాట వినిపిస్తుంది. లేదంటే.. నాణెనికి రెండు వైపులా బొమ్మ ఉన్నా.. కోహ్లీ బ్యాడ్ లక్ మారుతుందన్న జోకులు వేస్తుంటారు. ఏమైనా.. టాస్ బ్యాడ్ లక్ మాత్రం విరాట్ ను వదలకుండా ఉండటం గమనార్హం.