Begin typing your search above and press return to search.
స్టేడియంలో సెల్ఫీలు.. పరాగ్ ఇది కొంచెం ఓవర్ గా లేదూ..!
By: Tupaki Desk | 25 April 2021 9:30 AM GMTఐపీఎల్ అంటేనే ఎంటర్టైన్మెంట్. తక్కువ నిడివి ఉన్న మ్యాచ్ కావడం. అంతర్జాతీయ స్థాయిలో పేరున్న ఆటగాళ్లు పాల్గొంటుండటంతో ఐపీఎల్ కు ఎంతో క్రేజ్ ఉంటుంది. ఇక ఐపీఎల్ లో మనం ఎన్నో ఫన్నీ మూమెంట్స్ చూస్తుంటాం కూడా. నిన్న చెన్నైలోని చెపాక్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్.. కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడ్డ విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ కోల్‌కతా ఫెయిల్ అయ్యింది.
ఇదిలా ఉంటే రాజస్థాన్ రాయల్స్ కు చెందిన క్రికెటర్ రియాన్ పరాగ్ స్టేడియంలో ఎంతో ఉత్సాహంగా ఉంటాడు. ఎవరినైనా అవుట్ చేసిన .. ఏదైనా క్యాచ్ పట్టినా డ్యాన్స్ చేయడం అతడికి అలవాటు. అతడికి ఆనందం ఎక్కువైనప్పుడు అస్సామీ సంప్రదాయ నృత్యం ‘బిహు’ చేస్తుంటాడు. అయితే ఈ డ్యాన్స్ తో చిరాగ్ ఎంతో పాపులర్ అయ్యాడు. అయితే నిన్నటి మ్యాచ్ లో చిరాగ్ రెండు కీలక వికెట్లు తీసుకున్నాడు.
కమ్మిన్స్ ను అవుట్ చేసినప్పుడు .. మరో క్రికెటర్ రాహుల్ తెవాటియాతో కలిసి మాక్ సెల్ఫీ తీసుకున్నాడు. దీంతో అతడిపై ట్రోలింగ్ మొదలైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సాధారణంగా గ్రౌండ్ లోకి మొబైల్స్ అనుమతి ఉండదు .. కాబట్టి పరాగ్ తన వేళ్లతో సెల్ఫీని తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ కాగా.. కొందరు ఈ చర్యను ఓవర్ యాక్షన్ గా కామెంట్ చేశారు.
పరాగ్,రాహుల్ త్రిపాఠి, పాట్ కమ్మిన్స్ క్యాచ్‌లు తీసుకున్నాడు.అయితే ఈ విషయంపై పరాగ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'నేను ఎవరిని ఇబ్బంది పెట్టడానికి మాక్ సెల్ఫీ తీసుకోలేదు. కేవలం నా ఆనందాన్ని వ్యక్తం చేయడానికే మాత్రమే ఇలా చేశాను’ అంటూ వివరణ ఇచ్చుకున్నాడు చిరాగ్.