Begin typing your search above and press return to search.
ఈ డైలమా.. గుర్తించకపోతే.. ఇబ్బందే పవన్...!
By: Tupaki Desk | 19 Dec 2022 7:38 AM GMT''అదే.. టచ్!'' - అంటూ ఒక సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీలక్ష్మి, బాబూమోహన్‌ల మధ్య జరిగే సంభాషణ గుర్తుందా? ఇప్పుడు ఈ డైలాగులనే ఏపీ నెటిజన్లు పేలుస్తున్నారు. ''అదే డైలాగ్.. సేమ్ టు సేమ్.. కాకపో తే.. మధ్య మధ్యలో గ్యాప్'' అని వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనికి కారణం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన ప్రసంగం.. దానిలోని డైలాగులే..!
రాజకీయాల్లో నాణ్యత లోపించిందని పదే పదే చెప్పే పవన్.. తాను చేస్తున్న డైలాగుల్లోనూ నాణ్యత కని పించడం లేదన్న మేధావుల మాటను అంతో ఇంతో పట్టించుకోవాలి. ఒక్కసారి విజయనగరం జిల్లాకు వెళ్తే.. అక్కడ పవన్ చేసిన వ్యాఖ్యలు.. ఆశ్చర్యం కలిగించాయి. వచ్చే ఎన్నికల్లో ఒంటరి యుద్ధమేనని చెప్పారు. తన యుద్ధం తానే చేసుకుంటానని.. ఒకరికి ఊడిగం చేయబోనని చెప్పారు.
దీంతో శభాష్.. ఇంకేముంది.. పవన్ దెబ్బ.. సూపర్‌గా ఉంటుందని అనుకున్నారు. ఈ క్రమంలోనే కొందరు పార్టీలో చేరేందుకు కూడా రెడీ అయ్యారు. మేధావులు కూడా పవన్ చాలా దూకుడుగా ఉన్నారని అన్నారు. కానీ, ఇంతలోనే.. ఇప్పుడుసత్తెనపల్లి వేదికగా వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలకుండా చూస్తా.. రాజకీయ శక్తులను ఏకీకృతం చేస్తా.. వ్యూహం నాకు వదిలేయండి! అని డైలాగులు పేల్చారు.
అంటే.. మొత్తంగా.. అదే టచ్! అని శ్రీలక్ష్మి అన్నట్టుగా.. పవన్ ఇంకా అదే తడబాటులో ఉన్నారని విమర్శలు చెబుతున్నారు. తడబాటు కొద్దికాలం ఉండొచ్చు.. కానీ, ఇలా.. ప్రతి సారీ.. పొంతనలేకుండా పోవడం సమంజసం కాదని అంటున్నారు.
ఇలా చేసే కామెంట్లు.. ప్రజలను తడబాటుకు గురిచేస్తే.. మొత్తానికే మోసం వస్తుందని చెబుతున్నారు. ఒక సరైన నిర్ణయం తీసుకుని ముందుకు సాగితే.. బెటర్ అని సూచిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.