Begin typing your search above and press return to search.
ఎట్టకేలకు ప్లీనరీ ఫ్లెక్సీలకు.. ఫైన్ల పంచ్ లు వేస్తున్నారు
By: Tupaki Desk | 29 Oct 2021 11:30 AM GMT‘పార్టీ’ పెట్టి ఇరవైఏళ్లు అయిన సందర్భాన్ని పురస్కరించుకొని అంగరంగ వైభవంగా.. ఇటీవల కాలంలో మరే రాజకీయ పార్టీ నిర్వహించలేనంత భారీ స్థాయిలో ఒకరోజు ప్లీనరీని తెలంగాణ అధికార టీఆర్ఎస్ నిర్వహించటం తెలిసిందే. ఈ సందర్భంగా హైదరాబాద్ మహానగరం మొత్తం ఫ్లెక్సీలు.. హోర్డింగులు.. గులాబీ జెండాలతో నింపేశారు. ఈ వైనంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఎవరైనా హోర్డింగులు ఏర్పాటు చేస్తే.. వెంటనే సంబంధిత వ్యక్తులకు ఫైన్లు వేసే జీహెచ్ఎంసీ యంత్రాంగం.. ప్లీనరీ వేళ మాత్రం చేష్టలుడిగినట్లుగా ఉండిపోయింది.
దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తటమే కాదు.. ఆన్ లైన్ లో వీటికి సంబంధించిన ఫిర్యాదుల విభాగం సైతం సాంకేతిక కారణాలతో పని చేయటం నిలిపివేయటం తెలిసిందే. ఈ వ్యవహారంపై మీడియాలోనూ పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా జీహెచ్ఎంసీ ఎన్ ఫోర్సుమెంట్.. విజిలెన్స్.. డిజాస్టర్మేనేజ్ మెంట్ అధికారులు చర్యలు షురూ చేశారు.
ట్విటర్ ఖాతాను నిలిపివేసిన అధికారులు తాజాగా గురువారం సాయంత్రం పునరుద్ధరించటం.. ఆ వెంటనే వందల పోస్టులు వెల్లువెత్తాయి. ట్విటర్ ఖాతాను నిలిపినా.. నెటిజన్లు మాత్రం ఫ్లెక్సీలు.. కటౌట్ల ఫోటోల్నిపెద్ద ఎత్తున పోస్టు చేశారు. ఎప్పుడైతే ఖాతాను పునరుద్ధరించారో ఆ వెంటనే వాటికి సంబంధించిన ఫోటోలు వెల్లువెత్తాయి. దీంతో.. అధికారులు ఒక్కో పోస్టును పరిశీలించి.. సంబంధిత వ్యక్తులకు ఫైన్లు వేయటం షురూ చేశారు. గురువారం రాత్రి పది గంటల సమయానికి రూ.10లక్షల మేర ఫైన్లు వేసినట్లుగా అధికారులు చెబుతున్నారు. ఈ మొత్తం మరింత పెరగటం ఖాయమని చెబుతున్నారు.
ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసానికి రూ.1.5లక్షలు.. ఎమ్మెల్యే దానం నాగేందర్ కు రూ.3.10లక్షలు.. గ్రేటర్ మేయర్ గద్వాల విజయలక్ష్మికి రూ.65వేలు..మంత్రి మల్లారెడ్డికి రూ.10వేలు.. పలువురు ఎమ్మెల్యేలు.. నేతలకు ఫైన్లు పడినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి జనాగ్రహానికి అధికారులు తల వంచక తప్పలేదు. ఫైన్లు విధించక తప్పలేదు.