Begin typing your search above and press return to search.
గుత్తా జ్వాలాలో ఈ యాంగిల్ కుడా ఉందా?
By: Tupaki Desk | 18 May 2021 10:30 AM GMTవివాదాస్పద బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా మరోసారి వార్తల్లో నిలిచారు. నిత్యం వివాదాస్పద ఆరోపణలు, సంచలన ప్రకటనలతో హల్చల్ చేసే గుత్తా జ్వాలా ఈ సారి మాత్రం ఓ మంచి పనికి పూనుకున్నారు. ఆమె చేసిన పనికి నెటిజన్లు సైతం ఫిదా అయిపోయారు. గుత్తా జ్వాలాలో ఈ యాంగిల్ కూడా ఉందా? అంటూ షాక్ అయ్యారు. ప్రస్తుతం కోవిడ్ సమయం అన్న విషయం తెలిసిందే. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా అందరూ కోవిడ్ దెబ్బకు విలవిలలాడిపోతున్నారు. తమ ఇంట్లో ఎవరికైనా కోవిడ్ సోకి.. ఆస్పత్రి పాలైతే ఆ కుటుంబం నరకం అనుభవిస్తుంది. లక్షల్లో ఆస్పత్రి బిల్లులు చెల్లించలేక .. ఇళ్లు గుల్ల చేసుకుంటున్నారు.
హైదరాబాద్ కు చెందిన మహిళా క్రికెటర్ స్రవంతి నాయుడు తల్లి దండ్రులకు కోవిడ్ సోకింది. దీంతో వాళ్లు ఆస్పత్రిలో చేర్పించారు. ఇప్పటికే రూ. 16 లక్షలు ఖర్చయ్యాయి. దీంతో ఆమె ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ఈ విషయం తెలుసుకున్న గుత్తా జ్వాలా వెంటనే స్పందించారు. కష్టాల్లో ఉన్న స్రవంతి నాయుడు కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలంటూ ట్వీట్ చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఆమె కేటీఆర్ కు విజ్ఞప్తి చేశారు. అయితే గుత్తా జ్వాలా చేసిన ట్వీట్ క్షణాల్లో వైరల్ అయ్యింది. చాలా మంది ప్రముఖులు ఈ ట్వీట్ కు స్పందించి తమ వంతు సాయం చేస్తున్నారు. భారత క్రికెటర్ హనుమ విహారి స్పందించాడు. స్రవంతి కుటుంబానికి సాయం చేస్తానని భరోసా ఇచ్చాడు. ఇప్పటికే హనుమ విహారి ఓ చారిటీని నెలకొల్పి కోవిడ్ బాధితులకు సాయం చేస్తున్నాడు.
మరోవైపు జ్వాలా పిలుపుతో క్రికెట్ బోర్డులు స్పందించాయి. భారత మాజీ మహిళా క్రికెటర్ ఎస్‌కే స్రవంతి నాయుడుకు రూ.3లక్షలు మంజూరు చేయాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) నిర్ణయించింది. మరోవైపు చాలా మంది ప్రముఖులు, సామాన్యులు స్పందిస్తున్నారు. స్రవంతికి సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. గుత్తా జ్వాలా చొరవను పలువురు ప్రశంసిస్తున్నారు. తోటి క్రీడాకారిణి కష్టాల్లో ఉన్నప్పుడు ఆమె స్పందించిన తీరుకు ఫిదా అవుతున్నారు. గుత్తా జ్వాలా ఇటీవలే తమిళ నటుడు విష్ణు విశాల్ ను పెళ్లిచేసుకున్నది. కోవిడ్ ఎఫెక్ట్ తో వీళ్ల పెళ్లి నిరడంబరంగానే జరిగింది.