Begin typing your search above and press return to search.

జగన్ గొప్ప మనసు.. వైద్యుడికి కోటి సాయం

By:  Tupaki Desk   |   6 Jun 2021 1:30 AM GMT
జగన్ గొప్ప మనసు.. వైద్యుడికి కోటి సాయం
X
సీఎం జగన్ గొప్ప మనసు చాటుకున్నారు. బాధితులను ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుండే జగన్ దానకర్ణుడిలా వారికి సాయం చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. ఇప్పటికే ఎల్జీ పాలిమర్స్ బాధితులకు రూ.కోటి సాయం చేసి అందరిచేత ప్రశంసలు అందుకున్నాడు. విపత్తలు, యాక్సిడెంట్లు, అగ్ని ప్రమాద బాధితులకు లక్షల సాయం ప్రకటించారు.

తాజాగా ఓ ప్రభుత్వ వైద్యుడు కరోనాతో చావుకు దగ్గరైన వేళ అతడిని ఆదుకునేందుకు సీఎం జగన్ ముందుకొచ్చాడు. అతడి వైద్య ఖర్చులకు ఏకంగా కోటి రూపాయలు మంజూరు చేసి పెద్ద మనసు చాటుకున్నాడు. సదురు వైద్యుడి పూర్తి వైద్యఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించి గొప్ప నిర్ణయం తీసుకున్నారు,.

శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం కొత్తపుట్టుగకు చెందిన డాక్టర్ ఎన్. భాస్కర్ రావు ప్రకాశం జిల్లా కారంచేడు పీహెచ్సీ వైద్యాధికారిగా పనిచేస్తున్నారు. కరోనా వేళ ప్రజలకు వైద్యపరీక్షలు చికిత్సలు అందించాడు. ఈ క్రమంలోనే కరోనా పాజిటివ్ బారినపడ్డారు. ఏప్రిల్ 24న కరోనా బారినపడగా.. విజయవాడ ఆస్పత్రిలో మొదట చేర్చి అనంతరం హైదరాబాద్ ఆస్పత్రులన్నీ తిప్పారు.కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ చికిత్స చేశారు. ప్రస్తతుం గచ్చిబౌలి లోని కేర్ ఆస్పత్రిలో సీరియస్ పొజిషన్ లో ఉన్నాడు. ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నాయని.. వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడని వైద్యులు తెలిపారు. ఊపిరితిత్తులు మార్చనిదే బతకడని వైద్యులు తెలిపారు.

ఈ మార్పిడికి ఏకంగా రూ.1.50 కోట్లు ఖర్చు అవుతుందని ఆస్పత్రి నిర్వాహకులు తెలిపారు. అంత పెద్ద మొత్తం లేకపోవడంతో వైద్యుడి కుటుంబం.. తాజాగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని ఆశ్రయించింది. ఆయన పరిస్థితిని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లగా.. సీఎం వెంటనే స్పందించి వైద్యుడికయ్యే ఖర్చునంత భరిస్తామని.. కోటి రూపాయలు విడుదల చేశారు. మిగతా సొమ్ము భరిస్తామన్నారు. సీఎం జగన్ చూపిన ఉదారత ఆ కుటుంబం ఆయనకు కృతజ్ఞతలు తెలిపింది.