Begin typing your search above and press return to search.
మాల్యా `మూడో పెళ్లి`పై నెటిజన్ల సెటైర్లు!
By: Tupaki Desk | 29 March 2018 2:00 PM GMTభారత్ లో బ్యాంకులకు 9 వేల కోట్ల రూపాయలు పంగనామం పెట్టి లండన్ లో లైఫ్ ను ఎంజాయ్ చేస్తోన్న విజయ్ మాల్యాపై భారతీయులంతా గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. మాల్యాను భారత్ కు ఎప్పుడు రప్పిస్తారా....ఆ లిక్కర్ కింగ్ ఆస్తులను ఎప్పుడు జప్తు చేస్తారా...అని దేశ ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో, మాల్యా....ముచ్చటగా మూడో పెళ్లి చేసుకోబోతున్నాడని నిన్నటి నుంచి జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్న విషయం విదితమే. దీంతో, మాల్యాపై ఇప్పటికే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోన్న ప్రజలు...పెళ్లి వార్త విన్న తర్వాత...మరింత ఆగ్రహానికి గురయ్యారు. దీంతో, తమ ఆగ్రహానికి వ్యంగ్యాన్ని జోడించి....సోషల్ మీడియాలో మాల్యాపై సెటైర్లు వేస్తున్నారు. ప్రస్తుతం మాల్యాపై నెటిజన్ల వ్యంగ్యాస్త్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మాల్యాపై నెటిజన్లు తమకు తోచిన విధంగా వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారు. దేశంలోని బ్యాంకులకు వేలకోట్లు ఎగ్గొట్టిన మాల్యా....ముచ్చటగా మూడో పెళ్లి చేసుకోవడం వెనుక భారీ కుట్ర దాగి ఉందని, పింకీని పెళ్లి చేసుకున్న తర్వాత మాల్యా ఆమె కోరిక ప్రకారం ఇండియా కు వస్తాడని సెటైర్లు వేస్తున్నారు. పింకీ బలవంతం చేయడంతో భారత్ వచ్చిన మాల్యాను పట్టుకోవాలని ఇంటలిజెన్స్ వర్గాలు `ఆపరేషన్ పింకీ` ప్లాన్ చేశాయని, అదో హనీ ట్రాప్ అని కామెంట్స్ పెడుతున్నారు. మాల్యా `మూడో` పెళ్లి రోజును ఎస్ బీఐ జాతీయ సెలవుదినంగా ప్రకటిస్తుందని మరో నెటిజన్ పంచ్ పేల్చాడు. బ్యాంకుల దగ్గర దొబ్బేసిన డబ్బులు ఏం చేయాలో మాల్యాకు తెలియడం లేదని, అందుకే పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకుంటున్నాడని కామెంట్స్ చేస్తున్నారు.