Begin typing your search above and press return to search.
మోడీది మోసమైతే.. మరి బాబుదేంటి గల్లా.?
By: Tupaki Desk | 20 July 2018 11:13 AM GMTబావమరిది మహేష్ బాబుపై వల్ల మాలిన ప్రేమను కనబరిచాడు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్.. అవిశ్వాసంపై చర్చ సందర్భంగా మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను మూవీ కథను పార్లమెంట్ లో ప్రస్త్రావించి సంచలనం సృష్టించారు. ఆ సినిమా కథను చెబుతూ ప్రధాని నరేంద్రమోడీని మనిషి కాదని అంటూ గల్లా జయదేవ్ వ్యాఖ్యానించి సంచలనం రేపాడు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మోసం చేసిన బీజేపీ వైఖరిని పార్లమెంట్ సాక్షిగా తూర్పార పట్టారు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్. ఈ సందర్భంగా మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ సినిమా కథను వల్లెవేశారు. ఆ సినిమాలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని హీరో తల్లి చెప్పిన మాటకు కట్టుబడి సీఎంగా సేవలు అందిస్తాడని చెప్పారు.. ప్రామిస్ చేసి మాట తప్పితే మనిషి కాదని మహేశ్ అంటాడని జయదేవ్ ఉదాహరించారు. ప్రస్తుతం ప్రధాని మోడీ కూడా మాట తప్పి ప్రవర్తిస్తున్నాడని.. మోడీని ఏమనాలని నిలదీశాడు. ఏపీకి ఇచ్చిన మాట తప్పారని.. హామీల అమలుని గాలికొదిలేశారని విమర్శించారు. అందుకే అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టామని స్పష్టం చేశారు.
ప్రసంగం ప్రారంభించే ముందు గల్లా జయదేవ్ సీఎం చంద్రబాబుకి, తన సహచర ఎంపీ కేశినేని నానికి కృతజ్ఞతలు తెలిపారు. నిజానికి కేశినేని నాని తనకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు ను కోరినట్టు వార్తలు వచ్చాయి. కానీ గల్లాకు అవకాశం దక్కడంతో కేశినేనికి కృతజ్ఞతలు తెలపుతూ కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేశాడు.
గల్లా తన ప్రసంగంలో ఎంత సేపు మోడీ మాట తప్పారని విమర్శించారు. గల్లా ఆవేశంగా మాట్లాడిన వీడియోను షేర్ చేసిన నెటిజన్లు తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు హామీ ఇచ్చి మోసం చేసిన విషయాలను ప్రస్తావించి ఎండగడుతున్నారు. రాష్ట్రంలో కూడా చంద్రబాబు మాట తప్పారని.. మరి చంద్రబాబు మనిషి కాదా అంటూ సెటైర్లు వేస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు మేని ఫెస్టో రూపంలో ఎన్నో హామీలిచ్చిన బాబు.. ఓట్లు దండుకొని మోసం చేశాడని.. చంద్రబాబు మనిషి కాదా మరి అని గల్లా జయదేవ్ కు సెటైర్లు వేస్తున్నారు. గల్లా జయదేవ్ చెప్పిన మాటలు.. స్ట్రాటజీ ప్రకారం మోడీ మనిషి కాకపోతే .. హామీలిచ్చి నెరవేర్చని చంద్రబాబు కూడా మనిషి కాదని నెటిజన్లు తేల్చిచెబుతున్నారు. ఇలా టీడీపీ కౌంటర్లకు నెటిజన్లు ఎన్ కౌంటర్లు చేస్తున్నారు. ఈ వార్ ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు.