Begin typing your search above and press return to search.
తండ్రికి తగ్గ తనయుడు లోకేష్
By: Tupaki Desk | 23 Feb 2019 9:16 AM GMTఇచ్చిన మాట తప్పడంలో చంద్రబాబు నిష్ణాతుడు. ఎన్నికల కోసం రకరకాల హామీలిచ్చి ఆ తర్వాత అవి నెరవేర్చాలంటే చాలా డబ్బు కావాలి, కాబట్టి కుదరడం లేదని చేతులెత్తేయడంలో మహాదిట్ట. అంతేకాదు.. గతంలో నేను అలా అనలేదు అని కూడా వాదించగలడు. మద్యపాన నిషేధాన్ని అలాగే ఎత్తేశాడు. రైతు రుణమాఫీ కూడా అంతే. ఇక ప్రత్యేక హోదా సంజీవిని కాదు అన్న చంద్రబాబే.. ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం బీజేపీతో యుద్ధం చేస్తున్నాడు. ఇక మాట తప్పే విషయంలో.. తన తండ్రికి తగ్గ తనయుడ్ని అని లోకేష్ కూడా నిరూపించుకున్నాడు.
గతంలో ఓ టీవీ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు లోకేష్. ఆ ఇంటర్వ్యూలో భాగంగా.. ప్రత్యేక హోదా పేరుతో కేంద్రం మనకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తుందని.. దీని వల్ల చాలా లాభాలున్నాయని చెప్పుకొచ్చారు. అన్నింటికి మించి.. రాష్ట్ర అవసరాల కోసం బీజేపీతో సర్దుకుపోవాలని, వాళ్లు ఇచ్చింది మహాప్రసాదంలా తీసుకోవాలని సెలవిచ్చారు.
ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి.ఈ ఎన్నికల్లో ఏదో ఒక సెంటిమెంట్ రగిల్చే అంశం లేకపోతే.. తమ పార్టీకి ఇబ్బంది అనుకున్న చంద్రబాబు ప్రత్యేక హోదా నినాదాన్ని ఎత్తుకున్నారు. నాలుగన్నరేళ్లు బీజేపీతో అంటగాని.. ఇప్పుడు మోసం చేస్తుందని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఇదే విషయాన్ని లోకేష్ కూడా రకరకాల ఇంటర్వ్యూల్లో చెప్తున్నాడు. ఇప్పుడు గతంలో ఇచ్చిన ఇంటర్ వ్యూ - లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్ వ్యూ లు రెండింటిని పక్కపక్కనపెట్టి.. నెటిజన్లు ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. ఇన్నాళ్లే చంద్రబాబే అనుకున్నాం.. మాటలు మార్చడంలో లోకేష్ కూడా ముదిరిపోయాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.