Begin typing your search above and press return to search.
సర్వే’ద్రియానం.. ఎవరు చేయించుకుంటే వారిదే విజయం..
By: Tupaki Desk | 29 July 2022 4:42 PM GMTఅధికారం ఉంటే కొండ మీద కోతి అయినా దిగివస్తుంది. అధికారం ఉంటే వ్యవస్థలన్నీ పాదకాంత్రమవుతుంది. ‘ఈడీ’లు ప్రత్యర్థి పార్టీలపై ఎగబడుతాయి.. సీబీఐలు ప్రతిపక్ష నేతలను వేటాడుతాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక వారిది ఆడింది ఆట పాడింది పాటగా మారింది. కాంగ్రెస్ హయాంలో చెలరేగిపోయిన మీడియా కూడా ఇప్పుడు సైడ్ అయిపోయింది. బీజేపీ ధాటికి అవి కూడా నోరుమూసిన పరిస్థితి నెలకొంది.
దేశంలో సర్వేలను కూడా నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. అధికార పార్టీల కొమ్ము కాస్తూ ఏ ఎండకు ఆ గొడుగు కాస్తూ ఆ పార్టీలకే ఆధిక్యాలు ఇస్తున్నాయి. తాజాగా ఓ జాతీయ మీడియా సర్వే చేసింది. అందులో ఫక్తు బీజేపీకి, ఆ పార్టీకి బలపరిచే పార్టీలకే ఎంపీ సీట్లను కట్టబెట్టింది.
దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ బీజేపీదే అధికారమట.. కేంద్రంలో మళ్లీ బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని ఓ జాతీయ మీడియా సర్వే ఘోషించింది. ‘దేశ్ కీ ఆవాజ్ ఓపీనియన్ పోల్’ సర్వేలో ఎన్డీఏ కూటమి 362 ఎంపీ సీట్లు సాధిస్తుందని తెలిపింది. ఇక కాంగ్రెస్ 97 సీట్లు, ఇతరులు 84 సీట్లు వస్తాయని తెలిపింది.
ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ఏపీలో వైసీపీదే రాజ్యమని తేలింది. వైసీపీకి 19 ఎంపీ సీట్లు సాధిస్తుందని తేల్చింది. ఇక టీడీపీకి 6 సీట్లు మాత్రమే వస్తాయని తేలింది.
ఇక తెలంగాణలో టీఆర్ఎస్ 8 సీట్లు మాత్రమే వస్తాయని తేలింది. బీజేపీకి 6 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 2 సీట్లు, ఎంఐఎంకు 1 సీటు వస్తుందని వెల్లడించింది. యూపీలో బీజేపీకి 80కి 76 సీట్లు వస్తాయని తెలిపింది.
మెజార్టీ రాష్ట్రాల్లో బీజేపీకి, బీజేపీ మిత్రపక్షాలనే గెలుస్తాయని సర్వే తేలింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి అనుకూల వాతావరణం ఏమాత్రం లేదు. ఎందుకంటే దేశంలో బీజేపీ పాలనలో ప్రజలు ఏమాత్రం సంతృప్తిగా లేరని వారే ఘోషిస్తున్నారు. ధరలు విపరీతంగా పెరిగాయి. నిత్యావసరాలు ఆకాశాన్ని అంటాయి. పెట్రో ధరలు కొండెక్కి కూర్చున్నాయి. దీని ద్వారా అన్ని ధరలు కూడా భారీగా పెరిగాయి. జనాలు ధరలకు బెంబేలెత్తిపోతున్నారు. ఇక ఏపీలోనూ వైసీపీపై తీవ్ర వ్యతిరేకత.. ప్రజలు, లబ్ధిదారులు కూడా ఘోల్లుమంటున్న పరిస్థితి.
మరి ఇంతటి వ్యతిరేకతలో జాతీయ మీడియా ఏకపక్షంగా బీజేపీ గెలుస్తుందని సర్వేలో చెప్పడం ఎంత వరకూ కరెక్ట్ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి కొమ్ముకాస్తారా? అని విమర్శిస్తున్నారు. ఇక మేనేజ్ మెంట్ లో కింగ్ అయిన బీజేపీకి ఈ సర్వేలు మేనేజ్ చేయడం ఓ లెక్క కాదని అంటున్నారు. నిజంగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీజేపీని చిత్తుగా ఓడించడానికి జనాలు రెడీ అయ్యారని ఈ సర్వే చూసి కొందరు కామెంట్ చేస్తున్నారు. జనాభిప్రాయాన్ని ప్రతిబింబించేలా ఈ సర్వేలు ఉండాలని సూచిస్తున్నారు.