Begin typing your search above and press return to search.
పవన్ కల్యాణ్ ఎక్కడున్నారు? కొడుతున్న చోటకే చేరారా?
By: Tupaki Desk | 16 April 2019 7:58 AM GMTఏపీ ఎన్నికల ప్రచార సందర్భంగా జనసేన అధిపతి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలనే ప్రస్తావిస్తూ కొంతమంది ఇప్పుడు ఆయన విషయంలో వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. ఏపీ ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్ ప్రాంతీయవాదాన్ని రేకెత్తించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో ఆంధ్రులపై దాడులు జరుగుతున్నాయనే సంచలన ఆరోపణ చేశారు పవన్ కల్యాణ్. 'అక్కడ తెలంగాణ వాళ్లు ఏపీ వాళ్లంటూ కొడుతున్నారు..' అని పవన్ ఆరోపించడం సంచలనం రేపింది.
హైదరాబాద్ లో కానీ మిగతా తెలంగాణలో కానీ గత ఐదేళ్లలో ఎక్కడా ప్రాంతీయ విద్వేషాలతో దాడులు జరిగిన దాఖలాలు లేవు. అలా మీడియాకు ఎక్కిన వారు కానీ, వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన వారు కానీ లేరు. సామాన్యుల్లో అయినా, సెలబ్రిటీల్లో అయినా అలాంటి పరిస్థితి ఏదీ కనిపించ లేదు. రాష్ట్రం విడిపోయాకా కూడా.. ఎవరి పని వారిది అన్నట్టుగా సాగుతూ ఉంది.
అయితే వపన్ కల్యాణ్ మాత్రం తెలంగాణలో ఏపీ ప్రజల మీద దాడులు జరిగుతున్నాయంటూ వ్యాఖ్యానించారు. అయితే అప్పుడే పవన్ మీద కొన్ని సెటైర్లు పడ్డాయి. ఒకవైపు మెగా ఫ్యామిలీ అంతా కేసీఆర్ తో సన్నిహితంగా ఉంటూ, కేటీఆర్ భజన చేస్తూ ..అవసరానికి పవన్ కల్యాణ్ కూడా వెళ్లి కేసీఆర్ ను కలిసి తీరా ఎన్నికల సమయంలో పవన్ విద్వేషాలను రేకెత్తించేలా ప్రసంగాలు చేస్తున్నారనే విమర్శలు వచ్చాయి.
అయితే వాటిని పట్టించుకోకుండా పవన్ కల్యాణ్ అలాగే మాట్లాడారు. కట్ చేస్తే, ప్రచారం అయిపోయింది, పోలింగ్ అయిపోయింది.. ఇప్పుడు పవన్ కల్యాణ్ హైదరాబాద్ కు చేరుకున్నారని తెలుస్తోంది. పోలింగ్ తర్వాత రెండు మూడు రోజులు సీమాంధ్రలోనే తిరిగిన పవన్ కల్యాణ్.. ఇక అక్కడ పని అయిపోయిందన్నట్టుగా హైదరాబాద్ చేరుకుని తన మకాంలోనే ఉన్నారట!
మరి ప్రచారంలోనేమో.. హైదరాబాద్ లో వేధింపులు, కొడుతున్నారంటూ మాట్లాడి, పోలింగ్ పూర్తి కాగానే పవన్ కల్యాణ్ మళ్లీ హైదరాబాద్ కే చేరుకుని తన రొటీన్ కార్యక్రమాల్లో పడిపోవడం విశేషమే. ఇదే మరి రాజకీయ నేతల తీరు!