Begin typing your search above and press return to search.
ఫ్రూఫ్ లేకుండా లెటర్ రాయడం ఏంటి బాబు.. ఇదేనా 40ఏళ్ల అనుభవం?
By: Tupaki Desk | 17 Aug 2020 2:30 PM GMTటీడీపీ అధినేత చంద్రబాబు ‘తన 40ఏళ్ల రాజకీయ అనుభవంలో..’ అంటూ ప్రతీ ప్రెస్ మీట్ లో అధికార వైసీపీపై ఆడిపోసుకుంటూనే ఉంటారు. 40 ఇయర్స్ పాలిటిక్స్ అయిన చంద్రబాబు ఏపీ రాజకీయాలను అవపోసన పట్టారు. నాడు ఎన్టీఆర్ నుంచి నేటి జగన్ వరకు ఎంతోమంది సీఎంలను చూశారు.
అయితే అంత అనుభవం ఉన్న చంద్రబాబు ఇప్పుడు కనీస ఆధారాలు లేకుండా ప్రధాని మోడీకి లేఖ రాయడంపై అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.
ఏపీలో ఇద్దరు జడ్జీల మధ్యల సాగిన సంభాషణ మొదట లీక్ చేసింది టీడీపీ మీడియానే. సో ఈ తంతంగం వెనుకున్నది టీడీపీ అనేది వైసీపీ ఆరోపిస్తోంది.
ఈ క్రమంలోనే తమ చేతికి మట్టి అంటుకుంటుందోనని భయపడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా ఏపీలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని ప్రధాని మోడీకి లేఖ రాయడం విశేషం.
ఏపీలో ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతోందని పేర్కొన్న చంద్రబాబు.. రాజ్యాంగంలోని 19,21 ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, కార్యకర్తల ఫోన్లు ట్యాపింగ్ కు గురి అవుతున్నట్లు చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు.
అయితే వీటికి ఆధారాలేవి లేకుండానే.. ఆరోపణలపై చంద్రబాబు ఈ లేఖ రాయడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. 40 ఇయర్స్ పాలిటిక్స్ బాబేనా ఇలా చేసేది అని ఎద్దేవా చేస్తున్నారు.