Begin typing your search above and press return to search.

షాకింగ్.. చంద్రునిపై ఆ ఇల్లు.. ఎవరిది?

By:  Tupaki Desk   |   7 Dec 2021 7:44 AM IST
షాకింగ్.. చంద్రునిపై ఆ ఇల్లు.. ఎవరిది?
X
చంద్రమండలం రహస్యాలను తెలుసుకునేందుకు ప్రపంచదేశాల అంతరిక్ష సంస్థలు పరిశోధనలు చేస్తున్నాయి. అమెరికా, భారత్, చైన్ వంటి దేశాలన్నీ కూడా చంద్రుని మీద ప్రయోగాలు నిర్వహిస్తున్నాయి. అక్కడి నేల, వాతావరణం, ఇతర పరిస్థితులను అంచనా వేయడానికి చైనా యూతు 2 మూన్ రోవర్ ను పంపించింది.

అయితే ఈ పరిశోధనల్లో ఇటీవల ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. చంద్రునిపై ఓ ఘనాకార వస్తువును రోవర్ గుర్తించింది. ఇది చూడడానికి ఇల్లులా ఉంది. చైనా అంతరిక్ష సంస్థ అందుకు సంబంధించిన ఫొటోనూ విడుదల చేసింది. ఈ ఫొటో ప్రస్తుతం హాట్ టాపిక్ గా నిలిచింది.

క్యూబ్ ఆకారంలో ఉన్న ఈ ఆబ్జెక్ట్ ఇల్లు అని కొందరు అంటున్నారు. అయితే ఇది ఓ స్తూపం అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇంకొందరు ఇది ఏలియన్ అని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోపై కొందరు శాస్త్రవేత్తలు స్పందించారు. అందరూ అనుకుంటున్నట్లు అది ఇల్లు కాకపోవచ్చునని చెబుతున్నారు.

అంతేకాకుండా స్తూపం అయ్యే అవకాశం కూడా లేదని పేర్కొన్నారు. రాళ్ల నీడ అయి ఉంటుందని పేర్కొన్నారు. చంద్రుని మీద ఇళ్ల వంటి నిర్మాణాలు ఇప్పటివరకు జరిగే అవకాశం లేదని వారు అభిప్రాయపడుతున్నారు.

మిషన్ మూన్ లో భాగంగా చైనా ఛేంజ్ 4ను ఆ దేశం చంద్రుని మీదకు పంపింది. అక్కడి పరిస్థితులపై అధ్యయనం చేయడానికి శాస్త్రవేత్తల బృందం ఈ రోవర్ ను తయారు చేశారు. చంద్రుని మీద ఉండే గాలి, నీరు, నేల వంటి భౌతిక పరిస్థితులపై ప్రయోగాలు చేస్తున్నారు. అయితే చంద్రమండలం మీద ఇప్పటికే ఎన్నో దేశాలు పరిశోధనలు చేస్తున్నా కూడా అది ఒక మిస్టరీగానే ఉంటోంది.

పెరిగిన సాంకేతికతతో అన్ని దేశాలు పరిశోధనలు చేస్తున్నాయి. దేశాల అంతరిక్ష ప్రయోగాల్లో వేగం పెరిగింది. అయితే చంద్రుని మీద ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి. కాగా ఈ చంద్రుడి ఫొటో ప్రస్తుతం వైరల్ మారింది. సామాజిక మాధ్యమాల్లో దీనిపై భిన్న కామెంట్లు వస్తున్నాయి. చంద్రుని మీద ఇల్లు అనగానే నెటిజన్లు ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు.