Begin typing your search above and press return to search.

గెలిస్తే యోగీ...ఓడితే మోడీ... ?

By:  Tupaki Desk   |   8 Jan 2022 11:30 PM GMT
గెలిస్తే యోగీ...ఓడితే మోడీ... ?
X
ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకం అని వేరేగా చెప్పాల్సిన అవసరంలేదు. 2017లో జరిగిన శాసనసభ‌ ఎన్నికల్లో మొత్తం 403 సీట్లకు గానూ బీజేపీ 384 పోటీ చేసి 312 సీట్లను గెలుచుకుంది. ఆ ఎన్నికల్లో బీజేపీ నాలుగింట మూడు వంతులు సీట్లు సాధించి అతి పెద్ద రికార్డు సృష్టించింది. నాడు కేవలం 47 సీట్లు మాత్రమే ఎస్పీకి వస్తే బీఎస్పీకి 19, కాంగ్రెస్ కి ఏడు మాత్రమే వచ్చాయి. ఇక బీజేపీ మిత్రులకు కూడా పదమూడు సీట్లు దక్కాయి.

ఉత్తరప్రదేశ్ లో 2019లో మొత్తం 80 సీట్లకు గానూ మిత్రులతో కలసి 73 సీట్లను బీజేపీ గెలుచుకుని ధాటీగా జెండా ఎగరేసింది. ప్రధానిగా మోడీ మరోసారి గెలవడానికి ఈ అతి పెద్ద రాష్ట్రం దోహదపడింది. 2017లో అక్కడ యోగీ ఆదిత్యనాధ్ సీఎం అయ్యాక ఇంకా బీజేపీ మెజారిటీ పెరిగింది. మరి మోడీ మూడవసారి ప్రధాని కావాలంటే కచ్చితంగా యూపీలో కమలవికాసం జరిగి తీరాల్సిందే. అది కూడా బొటాబొటీగా కాదు, గతంలో సాధించినట్లుగా ఏకపక్ష విజయాలను దక్కించుకోవాలి.

ఇపుడు సీన్ చూస్తే అలాంటిది జరిగే చాన్స్ కనిపించడంలేదు. గత సారి వచ్చిన సీట్లలో ఏకంగా వంద దాకా బీజేపీకి కోత పడుతుందని తాజా సర్వేలు చెబుతున్నాయి. ఇక ఎన్నికలు దగ్గరపడేకొద్దీ ఎస్పీ ఇంకా బలంగా పుంజుకుంటుందని అంచనాలు ఉన్నాయి. అదే కనుక జరిగితే బీజేపీ అతి పెద్ద ప్రమాదంలో పడిపోతుంది. ఒకవేళ ఇపుడున్న సీన్ మారి బీజేపీ గెలుపు బాట పడితే మాత్రం కచ్చితంగా యోగీ రెండవసారి సీఎం అవుతారు. అపుడు యోగీ బీజేపీలోనే కీలక నేతగా జాతీయ స్థాయిలో ఎదగడం ఒక వెలుగు వెల‌గడం ఖాయం.

అంటే యూపీలో యోగీ రెండవసారి గెలిస్తే ఆయనే 2024 నాటికి కేంద్రంలో బీజేపీకి ప్రధాని అభ్యర్ధిగా మోడీకి ధీటుగా పోటీకి వస్తారు అని కూడా వినిపిస్తోంది. అలా యూపీలో బీజేపీని ఒంటి చేత్తో రెండవ మారు అధికారంలోకి తెచ్చిన ఘనతను యోగీ తన ఖాతాలో వేసుకోవడం కూడా జరిగిపోతుంది. ఇక యూపీలో బీజేపీ గెలిచినా కూడా అది ఒక విధంగా మోడీ మాస్టార్ కే ఇబ్బంది అవుతుంది అన్న మాట.

అలా కాకుండా బీజేపీ యూపీ ఎన్నికల్లో ఓటమి పాలైతే ఆ ఓటమి కచ్చితంగా మోడీ ఖాతాలోనే పడడం ఖాయమని అంటున్నారు. అదెలా అంటే జాతీయ స్థాయిలో మోడీ చరిష్మా తగ్గిపోయింది అని విపక్షాలు దేశవ్యాప్తంగా ఒక్కటిగా గొంతు పెంచి ఏకరువు పెడతాయి. అపుడు 2024 ఎన్నికల ఆశలు కూడా బీజేపీకి మోడీకి అడుగంటిపోతాయి. ఆ విధంగా చూసుకున్నా కొత్త తలనొప్పులు రెండేళ్ళ ముందుగానే స్టార్ట్ అవుతాయి. అంటే ఏ విధంగా చూసుకున్నా యూపీ బీజేపీకి బీపీ పెంచడం ష్యూర్ అన్న మాట. మరీ ముఖ్యంగా మోడీకి బీజేపీ ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చినా కూడా ఇబ్బందికరమే అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.