Begin typing your search above and press return to search.

50:50 టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ.. మార్పు త‌ప్ప‌దా..?

By:  Tupaki Desk   |   28 Dec 2021 7:30 AM GMT
50:50 టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ.. మార్పు త‌ప్ప‌దా..?
X
ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలోను, ఇటు అధికార ప‌క్షం వైసీపీలోను 50:50 అనే మాట వినిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి రెండు పార్టీల్లోనూ కీల‌క‌మైన మార్పులు త‌ప్ప‌వ‌ని అంటున్నారు. మ‌రోసారి అధికారం నిల‌బెట్టుకోవ‌డం ద్వారా.. తాను చేప‌ట్టిన సంక్షేమ కార్య‌క్ర‌మాలు, ప్ర‌భుత్వ ప‌థ‌కాలు ఖ‌చ్చితంగా ప్ర‌జ‌ల‌కు మేలు చేసేవేన‌ని.. నిరూపించాల్సిన అవ‌స‌రం వైసీపీకి ఉంది. అదే స‌మ‌యంలో పార్టీని నిల‌బెట్టుకోవ‌డంతోపాటు.. అసెంబ్లీలో చేసిన శ‌ప‌థాన్ని నిల‌బెట్టుకునే అవ‌స‌రం ఇటు ప్ర‌తిపక్షం టీడీపీపై ఉంది.

ఈ నేప‌థ్యంలో ఈ రెండు పార్టీలు కూడా వ‌చ్చే ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటాయ‌న‌డంలో సందేహం లేదు. అయితే. ఈ క్ర‌మంలోనే ఈ రెండు పార్టీల్లోనూ గెలుపు వ్యూహాలు ప్రారంభ‌మైన‌ట్టు తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో యువ‌త‌కు ఎక్కువ అవ‌కాశం ఇచ్చే దిశ‌గా.. చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నారు. అదే స‌మ‌యంలో వార‌సులు ఆయ‌న‌కు ఇబ్బందిగా ప‌రిణ‌మించారు. గ‌త 2019 ఎన్నిక‌ల్లోవార‌సుల‌కు చంద్ర‌బాబు ఎక్కువ స్థానాలు క‌ట్టెబ‌ట్టారు. కానీ, ఒక్క‌డ ఆదిరెడ్డి భ‌వానీ త‌ప్ప‌.. ఎవ‌రూ విజ‌యం ద‌క్కించుకోలేక పోయారు.

అయితే. మ‌ర‌ల వ‌చ్చే ఎన్నిక‌ల‌కు వీరు రెడీ అవుతున్నారు. పోనీ.. టికెట్లు ఇవ్వాల‌ని అనుకున్నా.. వ‌చ్చే ఎన్నిక‌ల కోసం.. ఇప్ప‌టి వ‌ర‌కు వార‌సులు చేసుకుంటున్న ప్ర‌య‌త్నాలు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. పార్టీ ఫేమ్ మీద‌నే ఆధార‌ప‌డిన వారు క‌నిపిస్తున్నారు. మ‌రోవైపు.. వైసీపీలోనూ వార‌సుల సంఖ్య పెరుగుతోంది. గ‌త ఎన్నిక‌ల్లో వార‌సుల‌కు టికెట్లు చాలా చాలా త‌క్కువ సంఖ్య‌లో ఇచ్చిన జ గ‌న్‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మాత్రం ఈ వార‌స‌లు వేడి నుంచి త‌ప్పించుకునే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు.

ఈ క్ర‌మంలోనే అటు టీడీపీ, ఇటు వైసీపీ కూడా 50:50 ఫార్ములాను అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. అంటే.. ఒకే కుటుంబంలో ఇద్ద‌రికి టికెట్లు ఇవ్వాల్సి వ‌చ్చినా.. ఒకే జిల్లాలో ఎక్కువ మంది వార‌సుల‌కు.. టికెట్లు ఇవ్వాల్సి వ‌చ్చినా.. కూడా.. ఈ ఫార్ములాను వినియోగించుకుంటార‌ని అంటున్నారు. అంటే.. వార‌సుల్లో ఒక‌రికి టికెట్ ఇచ్చి.. మ‌రొక‌రికి గెలిపించుకునే బాధ్య‌త‌ల‌ను అప్ప‌గిస్తారు. త‌ద్వారా.. పార్టీలో ఉన్న ప్లోటింగ్‌ను దాదాపు త‌గ్గించుకునే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. అయితే.. ఇది ఏమేర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.