Begin typing your search above and press return to search.
ఓవైసీ.. ఈ తరహా మాటల్ని మానుకుంటే మంచిది
By: Tupaki Desk | 25 Dec 2021 8:33 AM GMTమరో మూడు.. నాలుగు నెలల్లో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి యూపీ ఫలితం ఏ తీరులో ఉంటుందన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. ఈ ఎన్నికల ఫలితం దేశ రాజకీయాల మీద ప్రబావం చూపిస్తుందని చెప్పక తప్పదు. ఇలాంటి వేళ.. యూపీ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాల్ని సిద్ధం చేసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇలా ఎవరైనా మాట్లాడతారా? ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ ఇంత భాద్యతారాహిత్యంగా మాట్లాడటమా? అన్న విస్మయం వ్యక్తమవుతోంది.
ఇంతకూ ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఆయన మాటల్లోనే చూస్తే..
- ప్రధాని మోడీ.. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శాశ్వతంగా పదవుల్లో ఉండరని తెలుసుకోవాలి. వారి అండతో పోలీసులు రెచ్చిపోతున్నారు.
- యోగి తన గోరఖ్ పూర్ మఠానికి.. మోడీ కొండల్లోకో.. మరెక్కడికో వెళ్లిపోతే మిమ్మల్ని ఎవరు కాపాడతారు?
ఈ తీరులో ఆయన వ్యాఖ్యలు పరుషంగా.. హింసను ప్రేరేపించేలా ఉన్నాయి. ఈ నెల 12న కాన్పూరులో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజకీయ వర్గాల్లో కలకలాన్ని రేపుతున్న ఈ వ్యాఖ్యలు ఇప్పుడు మతం రంగు పులుముకుంటున్నాయి. ఇంతకీ ఓవైసీ నోటి నుంచి ఈ తరహా వ్యాఖ్యలు రావటానికి కారణం.. రసూలాబాద్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఒక పెద్ద వయస్కుడు మూత్ర విసర్జన చేశాడని.. ఆ ముస్లిం పెద్ద వయస్కుడి గడ్డాన్ని పట్టుకొని స్థానిక ఎస్ఐ లాగారని స్థానిక మజ్లిస్ నేత షౌకత్ తనకు చెప్పారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సాధారణంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినంతనే విరుచుకుపడే పోలీసులు.. ఓవైసీ మీద మాత్రం ఎందుకు చర్యలు తీసుకోవటం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. ఓవైసీ ప్రాతినిధ్యం వహించే హైదరాబాద్ మహానగరంతో పాటు.. ఏపీలో పోలీసులపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినప్పుడు స్పందించని ఓవైసీ.. యూపీ విషయంలో ఎందుకు అంతలా రియాక్టు అవుతున్నారన్న ప్రశ్న వ్యక్తమవుతోంది. ముస్లిం వ్యక్తిని ఎస్ ఐ అనుచితంగా ప్రవర్తిస్తే.. సదరు పోలీసు అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయాలని కానీ.. యూపీ పోలీసులు మొత్తాన్ని టార్గెట్ చేసేలా వార్నింగ్ ఇవ్వటం ఏమిటి? అన్నది ప్రశ్న.
ఇక్కడ మరో వాదన కూడా వినిపిస్తోంది. ఓవైసీ చేసిన వ్యాఖ్యలన్ని రాజకీయమేనని చెబుతున్నారు. సాధారణంగా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా.. ముస్లింలు అధికంగా ఉండే నియోజకవర్గాల్లో మజ్లిస్ అభ్యర్థుల్ని బరిలోకి దించటం.. మైనార్టీ ఓటు బ్యాంకును చీల్చటం ద్వారా బీజేపీకి లాభం చేస్తున్నారన్న వాదన వినిపిస్తూ ఉంటుంది. తాజాగా యూపీలో ఓవైసీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారటంతో.. హిందూ ఓటు బ్యాంక్ బలంగా మారి.. బీజేపీకి మేలు జరుగుతుందన్న మాట వినిపిస్తోంది. ఎన్నికలు అయ్యేనాటికి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు మరిన్ని చేస్తే.. యోగి చేతికి మరోసారి అధికారాన్ని అప్పగించటం ఖాయమంటున్నారు. ఈ దరిద్రపు గొట్ట రాజకీయాన్ని పక్కన పెడితే.. ఈ తరహా వ్యాఖ్యలు ఏ మాత్రం మంచి కల్చర్ కాదన్న మాట వినిపిస్తోంది.