Begin typing your search above and press return to search.
అందరినీ కలిపేది రఘురాముడేనట... ?
By: Tupaki Desk | 9 Jan 2022 2:30 AM GMTఏపీలో విపక్షాలు ఇప్పటికైతే వేటికవే అన్నట్లుగా ఉన్నాయి. జనసేన బీజేపీల మధ్య పొత్తు ఉన్నా ఆ రెండు పార్టీలు కలసి పోరాటాలు చేసిన దాఖలాలు లేవు. మరో వైపు టీడీపీ పొత్తు పిలుపులతో హడావుడి చేస్తోంది కానీ వర్కౌట్ కావడంలేదు. ఇక కాంగ్రెస్ వామపక్షాలు సరేసరి. ఇలా విపక్ష శిబిరం ఒక విధంగా విడిపోయినట్లుగానే ఉంది. కామన్ కాజ్ ఉంటేనే కలుస్తున్నారు. ఈ మధ్య చూస్తే అది అమరావతి రాజధాని అయింది. దాంతో ఈ మధ్య రైతులకు మద్దతుగా జరిగిన పాదయాత్రలోనూ, తిరుపతి సభలోనూ విపక్షాలు అన్నీ ఒకే వేదిక మీదకు వచ్చాయి.
అది అంతటితో ఆగిపోయింది. కానీ కావాల్సింది ఎన్నికల ఐక్యత. అంటే ఒక మహా కూటమిగా అంతా మారాలి. దాని కోసం టీడీపీఎ అధినేత చంద్రబాబు తెర వెనక చేస్తున్న ప్రయత్నాలు ఒక వైపు ఉండగానే వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ దానికి మరింత ఊతమిచ్చేలా తన యాక్షన్ ప్లాన్ ని రెడీ చేస్తున్నారు. అందులో భాగమే ఆయన సడెన్ గా రాజీనామా ప్రకటన చేయడమని అంటున్నారు. ఎంపీ పదవికి తాను రాజీనామా చేస్తానని, అమరావతిని ఏకైక రాజధానిగా ఉంచాలన్న డిమాండ్ తో తిరిగి నర్సాపురం లోక్ సభ సీట్లో పోటీ చేస్తామని రాజు ప్రకటించి ఏపీ రాజకీయాలలో సంచలనం రేపారు.
ఏపీలో వైసీపీ ఒక వైపు ఉంది. విపక్షాలు తలా వైపు ఉన్నాయి. వీటిని కలిపే అనుసంధానంగా అమరావతి ఏకైక రాజధాని నినాదాన్ని రాజు ఎంచుకున్నారని అంటున్నారు. ఆ విధంగా ఆయన రాజీనామా చేసి బీజేపీ తరఫున పోటీకి దిగినా కూడా అన్ని పార్టీలు తప్పనిసరిగా మద్దతు ఇస్తాయని స్కెచ్ గీశారని చెబుతున్నారు. బీజేపీకి మామూలుగా అయితే మద్దతు ఇవ్వని వామపక్షాలు కూడా ఈ ఇష్యూ మీద అయితే గట్టిగా నిలబడతాయని కూడా రాజు గారు అంచనా వేస్తున్నారుట.
బీజేపీ నుంచి రాజు పోటీ చేయడానికి సిద్ధపడినా ఆయనకు కావాల్సింది జనసేన, టీడీపీ మద్దతు, బీజేపీకి మిత్రపక్షంగా జనసేన సపోర్టుగా వస్తే టీడీపీ కూడా కచ్చితంగా మద్దతు ఇస్తుంది అని రాజు గారు ఊహిస్తున్నారు. ఇక అన్ని పార్టీల అండతో తాను బరిలో నిలబడితే అసలే ప్రజా వ్యతిరేకత ఒక రేంజిలో ఉన్న వైసీపీని ఓడించడం కష్టం కాబోదు అని ఆయన ఆలోచిస్తున్నారుట.
ఆ విధంగా ఏపీలో తమకు బలం ఉందని ఇప్పటిదాకా బీరాలు పోతున్న వైసీపీకి తొలి ఓటమిని చూపించాలని కూడా రాజు గారు కంకణం కట్టుకున్నారుట. అదే టైమ్ లో ఏపీలో విపక్ష కూటమిని కూడా ఒక్కటి చేసే లక్ష్యాన్ని కూడా పరిపూర్తి చేయలన్నది ఆయన ఉద్దేశ్యంగా ఉంది అంటున్నారు. మొత్తానికి రాజు భలే ఎత్తు వేశారు. మరి దీనికి తగిన పై ఎత్తు వైసీపీ వద్ద ఉందా అన్నదే చూడాలి. ఏది ఏమైనా వైసీపీకి చిక్కులు తెచ్చిపెట్టే పనిలో రఘురామ ఫుల్ బిజీగా ఉన్నారు అన్నది వాస్తవం.