Begin typing your search above and press return to search.

మన డప్పు మనం వాయించుకోవటమేనా రాహుల్?

By:  Tupaki Desk   |   26 Dec 2021 1:32 PM GMT
మన డప్పు మనం వాయించుకోవటమేనా రాహుల్?
X
మోడీ ఎంట్రీతో జాతీయ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. అప్పటివరకు పవర్ ఫుల్ గా ఉన్న వారు.. గడిచిన ఏడున్నరేళ్లలో ఎలా మారిపోయారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో అధికార పక్షానికి ఉండే అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ.. విపక్ష నేతల మాటలకు ప్రయారిటీ ఉండేది. మోడీ జమానాలో అది కాస్తా మిస్ అయ్యింది. జాతీయ అంశాలకు సంబంధించి ఎవరైనా మాట్లాడితే.. ఆ మాటల్ని ప్రముఖంగా ప్రచురించే మీడియా సంస్థలు బాగా తగ్గిపోయాయి. ఎందుకిలా? అంటే ఎవరికి వారు తమదైన వాదనల్ని వినిపిస్తూ ఉంటారు.

ఇదంతా ఎందుకంటే.. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత చేసిన వ్యాఖ్యలే. క్రిస్మస్ పర్వదినాన రాత్రి వేళలో అనూహ్యంగా జాతిని ఉద్దేశించిన ప్రధాని నరేంద్ర మోడీ.. బూస్టర్ డోసు గురించి.. 15-18 ఏళ్ల వారికి జనవరి మూడు నుంచి వ్యాక్సిన్ అందజేస్తామన్న కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రధాని మోడీ నోటి వెంట వచ్చిన ఈ వ్యాఖ్యలకు తానే కారణమని రాహుల్ చెప్పుకున్నారు. బూస్టర్ డోసుపై తానిచ్చిన సలహాను కేంద్రం స్వీకరించిందన్నారు. ఇది సరైన నిర్ణయమని.. వ్యాక్సిన్ వల్ల వచ్చే రక్షణ ప్రతి ఒక్కకరికీ చేరాలంటూ ఆయన ట్వీట్ చేశారు.

దేశంలో వ్యాక్సినేషన్ పురోగతిపై డిసెంబరు 22న రాహుల్ ఒక ట్వీట్ చేయటం.. డిసెంబరు నాటికి నిర్దేశించుకున్న వ్యాక్సిన్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయారని గణాంకాల రూపంలో వెల్లడించారు. అత్యధిక మందికి టీకాలు ఇంకా అందలేదంటూ.. తన వాదనకు తగ్గ గణాంకాల్ని అందులో ప్రస్తావించారు. తాజాగా ప్రధాని మోడీ చేసిన బూస్టర్ డోసు ప్రకటన వెనుక తాను ఉన్నట్లుగా చెప్పిన రాహుల్ మాటలకు నవ్వాలో.. ఏడవాలో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే.. ఒక ట్వీట్ చేసినంతనే మోడీ తన మనసును మార్చుకొని నిర్ణయం తీసుకున్నారని భావించటం తప్పే అవుతుంది.

నిజానికి తన గొప్ప గురించి తాను చెప్పుకోవాల్సిన అవసరం రాహుల్ కు ఏముంది? అంత పెద్ద పార్టీకి అగ్రనేతగా ఉండి.. నిజానికి రాహుల్ చేసిన సూచనను ప్రధాని మోడీ ఫాలో అయ్యారన్నది కాంగ్రెస్ సీనియర్ నేతలు చెప్పొచ్చు కదా? అదేమీ లేకుండా.. తన డప్పు తానే కొట్టుకోవటం దేనికి నిదర్శనం? తన ఇమేజ్ ను పెంచుకోవాలన్నదే రాహుల్ ఆలోచన అయితే.. ఇప్పుడు అనుసరిస్తున్న మార్గం ఏ మాత్రం సరికాదన్నది ఆయన గుర్తించాల్సిన అవసరం ఉంది