Begin typing your search above and press return to search.
ఇదేం పోయే కాలం రాజాసింగ్.. ఇలాంటి మాటలు అవసరమా?
By: Tupaki Desk | 25 Dec 2021 5:06 AM GMTరాజకీయాలు అంతకంతకూ దిగజారుతున్నాయి. తమను ఫాలో అయ్యే వారిని ఉద్రేకపరిచేందుకు నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం ఏ మాత్రం సరికాదు. ఈ విషయాన్ని బాధ్యత కలిగిన నేతలు అస్సలు మర్చిపోకూడదు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మరీ పదవుల్లోకి వచ్చే వారు.. తమ నోటి నుంచి వచ్చే మాటల విషయంలో ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించాలి. లేదంటే.. అందుకు తగ్గ మూల్యం చెల్లించక తప్పదు. తాజాగా బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రాజా సింగ్ నోటికి వచ్చినట్లుగా మాట్లాడారు. అడ్డగోలు వ్యాఖ్యలు చేసి.. అనవసరమైన రచ్చకు తెర తీసే ప్రయత్నం చేశారు.
ఇలాంటి తీరును తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఆయన వ్యాఖ్యల్ని చూస్తే.. చౌకబారు రాజకీయాలు చేయాలన్న తలంపు తప్పించి.. మరే ఎజెండా లేనట్లుగా కనిపిస్తోంది. ఇంతకూ రాజా సింగ్ నోటి నుంచి వచ్చిన అడ్డగోలు మాటలేందన్నది చూస్తే.. తెలంగాణ రాష్ట్రంలో నిజాం నవాబు పేరు మీద ఉన్న ప్రతి వస్తువునూ ధ్వంసం చేస్తామని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యల్ని కాసేపు పక్కన పెట్టి.. ఈ వ్యాఖ్యను చూసినప్పుడు నిమ్స్ పేరుతో పేదలకు.. బడుగు.. బలహీన వర్గాలకు చౌక ధరలకు వైద్యం చేసే ఆసుపత్రి పేరు ముందు కూడా నిజాం అని ఉంటుంది. రాజాసింగ్ తాజా మాటల్ని చూస్తే.. ఈ ఆసుపత్రిని కూడా ధ్వంసం చేయాలి. లేదంటే.. పేరు మార్చాలి.
కానీ.. మర్చిపోకూడని విషయం ఏమంటే.. ఎవరికి అధికారం శాశ్వితం కాదు. ఇవాళ ఒక పేరును మారిస్తే..రేపు అధికారంలోకి వచ్చిన వారు నాలుగు పేర్లు మారుస్తారు. ఇదంతా అనవసరమైన వ్యవహారం తప్పించి మరింకేమీ కాదు. తెలంగాణ రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే హైదరాబాద్ పేరును భాగ్యనగర్ గా మారుస్తామన్న ఆయన.. సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో మాట్లాడారు. ఈ సందర్భంగ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కదానికీ నిజాం పేరు ఉందని.. ఆయన చేసిన దౌర్జన్యాల్ని ప్రజల ముందుకు తీసుకొచ్చి.. నిజాం పేరుతో ఉన్న వస్తువులను ధ్వంసం చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని.. అధికారం చేపట్టిన వెంటనే పేరును మార్చటంతో పాటు.. సికింద్రాబాద్..కరీంనగర్..నిజామాబాద్ పేర్లను సైతం మారుస్తామని.. తెలంగాణ కోసం పోరాడిన వీరుల పేర్లు ఆయా ప్రాంతాలకు పెడతామన్నారు. ఇలాంటి పిచ్చి మాటలు.. తలతిక్క మాటలు అదే పనిగా మాట్లాడితే.. ఓట్లు వేద్దామనుకున్న వారు సైతం ఓట్లు వేయరన్న విమర్శ వినిపిస్తోంది.
మనం అవునన్నా.. కాదన్నా నిజాం రాజులు హైదరాబాద్ కూడిన తెలంగాణ ప్రాంతాన్ని పాలించారు. ఇది చరిత్ర. దాన్ని మనం ధ్వంసం చేసినంత మాత్రం భౌతికంగా చెరిగిపోతుందేమో కానీ.. చరిత్రలో కనిపించకుండా పోదు కదా? తాలిబన్ తరహాలో చేసే వ్యాఖ్యలు.. పార్టీని ప్రేమించే వారిని దూరం చేస్తుందన్న నిజాన్ని రాజాసింగ్ గుర్తించి..తనను తాను మార్చుకోవటంతో పాటు.. తన మాటల్ని అదుపులోకి ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.