Begin typing your search above and press return to search.

అంత క్లోజ్ అయిన వర్మ.. జగన్ ను ఎందుకు టార్గెట్ చేశాడు?

By:  Tupaki Desk   |   5 Jan 2022 7:25 AM GMT
అంత క్లోజ్ అయిన వర్మ.. జగన్ ను ఎందుకు టార్గెట్ చేశాడు?
X
కొద్దిరోజుల వరకూ జగన్ పై ఈగ వాలనిచ్చేవాడు కాదు మన రాంగోపాల్ వర్మ. ఈ క్రమంలోనే ఆయన ప్రత్యర్థి చంద్రబాబుపై ఏకంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’, కడప రెడ్లు అనే సినిమాలు తీసి చంద్రబాబును విలన్ గా చూపించాడు.అ యితే సినిమా టికెట్ల రేట్లు ఈ ఇద్దరు మిత్రుల మధ్య చిచ్చు పెట్టింది. స్వయంగా దర్శకుడు నిర్మాత అయిన వర్మకు సినీ కష్టాలు తెలుసు. అందుకే ఏపీ ప్రభుత్వం తప్పుదారిలో వెళుతుందని మెల్లిగా చెప్పాడు. తనకే పేర్ని నాని నుంచి కౌంటర్లు పడడంతో ఇక విరుచుకుపడుతున్నాడు.

టికెట్ రేట్లను ప్రభుత్వం నిర్ణయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రాంగోపాల్ వర్మ తాజాగా మంత్రి పేర్ని నానికి 10 ప్రశ్నలు సంధించాడు. అవిప్పుడు వైరల్ అయ్యాయి.

వర్మ వ్యాఖ్యాలపై ఇటు నాని గానీ వైసీపీ నేతలు గానీ ఇప్పటివరకూ స్పందించలేదు. తాజాగా పేర్ని నాని కౌంటర్ ఇచ్చాడు. దీంతో వర్మ రెచ్చిపోయి ఏకంగా జగన్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు తప్పు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

యూట్యూబ్ లో ఓ వీడియో పోస్ట్ చేసి ఏకంగా 10 ప్రశ్నలంటూ జగన్ సర్కార్ తీరును వర్మ కడిగేశాడు. అంతేకాదు .. వైఎస్ఆర్ కొడుకు కాకపోయి ఉంటే నువ్వు సీఎం అయ్యేవాడివా? జగన్ కు ఇన్ని ఓట్లు పడేవా? అంటూ ఏకంగా తన మిత్రుడిపైనే విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు.

ఇక ఫ్లాప్ సినిమాలు అంటగట్టి మంచి రేట్లతో వినియోగదారుడిని ట్రైలర్ చూపించి ఆకర్షించి మోసం చేస్తున్నారన్న పేర్ని నానికి వర్మ కౌంటర్ ఇచ్చారు. పుచ్చిపోయిన టమాటాలు వెనక్కి ఇవ్వడానికి.. టమాటాలు కొని రుచి చూసిన తర్వాత టేస్ట్ బోగోలేదని వెనక్కు ఇవ్వడానికి తేడా ఉందని పేర్నినానికి కౌంటర్ ఇచ్చారు. తనకూ వైసీపీ పాలన నచ్చలేదనని.. ఓటేసిన వారంటే అధికారంలోంచి దిగిపోతారా? అంటూ వర్మ సూటిగా ప్రశ్నించారు. ఏ వస్తువుకైనా ధర నిర్ణయించే హక్కు తయారీదారుడిదే నంటూ వర్మ నిప్పులు చెరిగారు.

టీవీ, ఫ్రిడ్జ్ వంటి వాటికి గ్యారెంటీ వారంటీ ఉంటుందని.. సినిమాను అలా వెనక్కి ఇచ్చేయలేమన్నారు.. హీరో ఇమేజ్, దర్శకుడి ప్రతిభ బడ్జెట్ బట్టి టికెట్ రేట్ ఉంటుందని వర్మ తెలిపారు.

ఇక రాజమౌళి కంటే జగన్, పేర్నినాని, అనిల్ కుమార్ , కొడాలి నానిలు గొప్ప సినిమా తీసి పేద ప్రజలకు ఫ్రీగా చూపించాలని వర్మ సెటైర్ వేశారు. అలాంటి కెపాసిటీ లేనివారు తమకున్న పవర్ ను ఉపయోగించి సినిమాను కొని పేదలకు ఉచితంగా చూపించాలన్నారు. వోడ్కా తాగుతూ ఈ వీడియో చేసిన వర్మ తాను తాగి మాట్లాడడం లేదని.. నిజాలు మాట్లాడుతున్నానని అనడం కొసమెరుపు.