Begin typing your search above and press return to search.

వ‌ర్మ‌.. నీ ట్వీట్ల సారాంశం ఏంటి? అయితే.. 100% అసంతృప్తేనా?

By:  Tupaki Desk   |   11 Jan 2022 1:30 PM GMT
వ‌ర్మ‌.. నీ ట్వీట్ల సారాంశం ఏంటి? అయితే.. 100% అసంతృప్తేనా?
X
ఏపీలో సినిమా టికెట్ల ధ‌ర‌ల త‌గ్గింపుపై.. ద‌ర్శ‌కుడు రాం గోపాల్ వ‌ర్మ మ‌రోసారి ట్వీట్ల యుద్ధానికి దిగారు. వాస్త‌వానికి ఆయ‌న మంత్రి పేర్ని నానితో చ‌ర్చ‌లు జ‌రిపారు. దాదాపు రెండున్న‌ర గంట‌ల సేపు ఆయ‌న చ‌ర్చించారు. అనంత‌రం తాను ఈ చ‌ర్చ‌ల‌పై 100 శాతం సంతృప్తిగా ఉన్నాన‌ని చెప్పారు. అయితే.. అనూహ్యంగా మ‌ళ్లీ ట్వీట్ల యుద్ధం చేయ‌డం ప్రారంభించారు. కేవ‌లం ఒక‌ గంట‌లో 24 ట్వీట్లు చేశారు. అంటే.. ఐదు నిముషాల‌కు ఒక‌టి చొప్పున ఆయ‌న ట్వీట్ చేశారు. ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఏకంగా గంటలో 24 ట్వీట్లు చేయడం ఆసక్తిగా మారింది. సోమవారం మంత్రి పేర్నినానితో భేటీ అయిన ఆయన.. చర్చల పట్ల సంతృప్తి వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. తాజాగా ట్వీట్లలో అందుకు భిన్నంగా స్పందించారు.

వ‌ర్మ ట్వీట్లు ఇవే..

రూ.500 కోట్లతో తీసిన ‘ఆర్ఆర్‌ఆర్‌’ రూ.కోటి తీసిన చిత్రంతో ఎలా పోలుస్తాం. చిన్న చిత్రాలతో సమానంగా భారీ చిత్రాల టికెట్‌ ధర ఎలా నిర్ణయిస్తాం.

సినిమా నిర్మాణ వ్యయంతో తమకు సంబంధం లేదని ప్రభుత్వం వాదించాలనుకుంటే అదే వాదన ప్రపంచంలో ఎక్కడ తయారైన వస్తువుకైనా వర్తిస్తుందా?

పోటీ ఆధారంగానే వస్తువుల నాణ్యత, ధర నిర్ణయిస్తారు. బాహ్య శక్తుల ఆధారంగా కంపెనీలు ధరలు నిర్ణయించవు.

ఒక రాష్ట్రంలో సినిమా టికెట్‌ రూ.2,200లకు విక్రయిస్తుంటే, అదే సినిమా టికెట్‌ ఏపీలో రూ.200లకు ఎలా విక్రయిస్తారు. ఆర్టికల్‌14 ప్రకారం అది నిబంధనలు ఉల్లంఘించడం కాదా?

తక్కువ ధరలకు అమ్మాలని ప్రభుత్వం బలవంతం చేస్తే, అసలు ఉత్పత్తే ఆగిపోవచ్చు. అప్పుడు నాసిరకం ఉత్పత్తులు బయటకు వస్తాయి.

సినిమాల టికెట్ల ధరలకు విధించినట్లే రాష్ట్రంలో ఇంకేదైనా ఉత్పత్తిపై ప్రభుత్వం నిబంధనలు విధించిందా?ఒక వేళ విధించి ఉంటే ఆ ఉత్పత్తుల పేర్లు, అందుకు కారణాలు తెలిపాలి.

మహారాష్ట్రలో 'ఆర్‌ఆర్‌ఆర్‌' టికెట్‌ ధర రూ.2,200గా ఉందన్న వర్మ.. రాజమౌళి సొంత రాష్ట్రమైన ఏపీలో రూ.200కు కూడా అనుమతించని దుస్థితి ఉందని ఆక్షేపించారు.'హూ కిల్డ్‌ కట్టప్ప'..? అంటూ తనదైన శైలిలో సెటైర్ విసిరారు. వేర్వేరు టికెట్‌ ధరల నిర్ణయం ఆర్టికల్‌ 14 ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు. రాత్రీపగలు ప్రదర్శనలకు అనుమతిస్తే నష్టమేంటని ప్రశ్నించారు. కొవిడ్‌ రాకముందు మహారాష్ట్రలో 24 గంటలూ షోలు నడిచాయని తెలిపారు.