Begin typing your search above and press return to search.
జగన్ వెంట సీనియర్ ఎంపీలు లేరా?
By: Tupaki Desk | 4 Jan 2022 1:30 PM GMTరాజు వెడలె రవితేజము లలరగ! అన్నట్టుగా.. వైసీపీ అధినేత జగన్ ఢిల్లీటూర్‌కు వెళ్లిన ప్రతిసారీ.. ఆయన వెంట మందీ మార్బలం భారీగా ఉంటుంది. ముఖ్యంగా సీనియర్ ఎంపీలు.. పార్టీకి చెందిన సీనియర్ నాయ కులు కూడా ఉంటారు. తమకు తోచిన రీతిలో జగన్‌కు అక్కడ లైన్ క్లియర్ అయ్యేలా వారు వ్యవహరిస్తారు. అయితే.. ఇప్పుడు తాజాగా జగన్ చేపట్టిన ఢిల్లీలో ప్రయాణంలో సీనియర్లు ఎక్కడా కనిపించడం లేదు. లోక్‌సభా పక్ష వైసీపీ నాయకుడిగా మిథున్‌రెడ్డి ఒక్కరే కనిపిస్తున్నారు. మరి మిగిలిన వారి పరిస్థితి ఏంటి? వారు ఎందుకు వెళ్లలేదు.. ? అనే ప్రశ్న తెరమీదకి వచ్చింది.
జగన్‌తోపాటు ప్రధాని నివాసానికి వెళ్లినవారిలో వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి(రాజ్యసభ), మిథున్‌రెడ్డి (రాజంపేట), మార్గాని భరత్(రాజమండ్రి), తలారి రంగయ్య(అనంతపురం), ఎంవీవీ సత్యనారాయణ(విశాఖ) తదితరులు ఉన్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి మధ్యా హ్నం 1.25 గంటలకు వచ్చారు. 2.15 గంటలకు 1-జన్‌పథ్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భం గా అందుబాటులో ఉన్న పార్టీ ఎంపీలతో భేటీ అయ్యారు. ప్రధాని, కేంద్ర మంత్రుల వద్ద ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించినట్లు సమాచారం.
అయితే.. ఈ క్రమంలో సీఎం వెంట మిగిలిన సీనియర్ ఎంపీలు.. మాగుంట శ్రీనివాసుల రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, పెద్దారెడ్డి, బాల శౌరి, సత్యవతి వంటి వారు కనిపించలేదు. మిథున్ తప్పితే.. మిగిలిన వారు అందరూ కూడా కొత్త వారే.. సాయిరెడ్డి ఎప్పుడూ.. అవిభక్త కవలలుగా కలిసే ఉంటున్న విషయం తెలిసిందే. మరి సీనియర్లు ఎందుకు వెళ్లలేదు. ఈ విషయమే రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. సీనియర్లను ఉద్దేశ పూర్వంగానే దూరం పెట్టారా? లేక వారే వెళ్లలేదా? అనే సందేహాలు కూడా వస్తున్నాయి.
వాస్తవానికి సీఎం జగన్ ప్రధానిని కానీ, ఇతర మంత్రులను కానీ.. కలిసినప్పుడు.. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై చర్చిస్తారని ప్రకటిస్తున్నారు. మరి రాష్ట్ర సమస్యలపై చర్చించేందు వెళ్తే.. సీనియర్లను కూడా తీసుకు వెళ్లి.. మరింత ఒత్తిడి చేసే అవకాశం ఉంది. వారిని కూడా ప్రధానికకి పరిచయం చేసి.. సమస్యలను మరింత గా వివరించే ప్రయత్నం చేయాలి. కానీ, జగన్ అలా చేయడం లేదు.. సీనియర్లను పక్కన పెడుతున్నారు.. అంటే.. ఏదో అనుమానించాల్సిన అంశం ఉందని పరిశీలకులు అంటున్నారు. వ్యక్తిగత విషయాలపై చర్చించే ఉద్దేశం ఉన్నప్పుడే.. తన అనుంగు ఎంపీలను తీసుకువెళ్లి ఉంటారని చెబుతున్నారు. మరి దీనిలో నిజం ఎంతో తెలియాలంటే.. వెయిట్ చేయాల్సిందే.