Begin typing your search above and press return to search.

ఆ కమ్మ నేతలే సైకిల్‌ని నిలబెట్టాలి....!

By:  Tupaki Desk   |   5 Jan 2022 1:30 AM GMT
ఆ కమ్మ నేతలే సైకిల్‌ని నిలబెట్టాలి....!
X
వైసీపీలో రెడ్డి, టీడీపీలో కమ్మ సామాజికవర్గాల ప్రభావం ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఇందులో ఎలాంటి డౌట్ లేదనే చెప్పొచ్చు. వైసీపీలో రెడ్డి వర్గానికి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. అలాగే టీడీపీలో కమ్మ వర్గం హవా ఉంటుంది. అయితే టీడీపీకి బీసీల అండగా కూడా ఎక్కువే. కాకపోతే కమ్మ వర్గంలో బలమైన నాయకులు ఉన్నారు. చాలా నియోజకవర్గాల్లో కమ్మ వర్గం నేతలే పార్టీని నడిపిస్తున్నారు. ఇక వారు సక్సెస్ అయితే... దాదాపు టీడీపీ కూడా సక్సెస్ అయినట్లే అని చెప్పొచ్చు.

అయితే గత ఎన్నికల్లో కమ్మ నేతలు ఫెయిల్ అయ్యారు. అటు వైసీపీలో రెడ్డి నేతలు సక్సెస్ అయ్యారు. దీంతో రిజల్ట్ పూర్తిగా మారిపోయింది. ఇక వచ్చే ఎన్నికల్లో టీడీపీని నిలబెట్టాల్సిన బాధ్య‌త ఎక్కువుగా కమ్మ నేతల‌దే అని చెప్పాలి. వారు ఎక్కువ మంది గెలిస్తేనే టీడీపీకి కలిసొస్తుంది. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు గెలిచిన అందులో సగం మంది కమ్మ వర్గం వారే. 23 మందిలో 11 మంది క‌మ్మ‌లే ఉన్నారు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో వారు గెల‌వ‌డంతో పాటు ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీని గెలిపించే బాధ్య‌త కూడా తీసుకోవాల్సి ఉంది.

గత ఎన్నికల్లో ఓడిపోయిన కమ్మ నేతలు ఈ సారి గెలవగలితేనే టీడీపీకి అధికారంలోకి రావడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. దేవినేని ఉమా, చింతమనేని ప్రభాకర్, ధూళిపాళ్ళ నరేంద్ర, జి‌వి ఆంజనేయులు, ఆలపాటి రాజా, కొమ్మాలపాటి శ్రీధర్, బోడే ప్రసాద్, యరపతినేని శ్రీనివాసరావు, దామచర్ల జనార్ధన్, గన్ని వీరాంజనేయులు, నారా లోకేష్, పరిటాల శ్రీరామ్, అరిమిల్లి రాధాకృష్ణ‌, పెందుర్తి వెంక‌టేష్‌తో పాటు ఇంకా పలువురు కమ్మ నేతలు... పలు నియోజకవర్గాల్లో టీడీపీని నడిపిస్తున్నారు.

వైసీపీ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో 50 మంది రెడ్డి ఎమ్మెల్యేలు గెలిచారు. ఆ సామాజిక వ‌ర్గం ఏక‌మ‌వ్వ‌డంతోనే జ‌గ‌న్‌కు ఇంత మెజార్టీ వ‌చ్చింది. ఆ వ‌ర్గం నేత‌లు ఎక్కువ మంది గెలిచారు. గ‌త ఎన్నిక‌ల్లో క‌మ్మ‌లు చీలిపోయారు. 2024లో ఈ కమ్మ నేతలు సత్తా చాటగలిగితేనే టీడీపీకి అధికారం దక్కుతుందని చెప్పొచ్చు. 2014 ఎన్నికల్లో వీరంతా గెలిచిన నాయకులే...కానీ 2019 ఎన్నికల్లో వీరంతా ఓడిపోయారు. కాబట్టి నెక్స్ట్ ఎన్నికల్లో వీరు సత్తా చాటితే... టీడీపీకి పెద్ద అడ్వాంటేజ్ అవుతుందని చెప్పొచ్చు.