Begin typing your search above and press return to search.
తమ్ముళ్ళల్లో అయోమయం ?
By: Tupaki Desk | 5 Jan 2022 5:45 AM GMTతమ్ముళ్ళల్లో అయోమయం పెరిగిపోతోంది. ఎందుకంటే చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్యనేతల సమావేశం జరగబోతోంది. అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల ఇన్చార్జీలు, ముఖ్యనేతలతో కీలకమైన భేటీ జరగబోతోంది. రాబోయే ఎన్నికల్లో నేతలు పోషించాల్సిన పాత్రేమిటి ? నేతల పరిధి ఏమిటి ? ప్రత్యర్ధులను ప్రధానంగా అధికారపార్టీని ఏ విధంగా ఎదుర్కోవాలనే అంశాలు చర్చించబోతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ నేతలు చేయాల్సిన నిరసన కార్యక్రమాలు తదితరాలన్నింటినీ చర్చిస్తారు.
అంతా బాగానే ఉంది. ప్రతిపక్షమన్నాక ఎప్పటికప్పుడు అప్ డేట్ అవ్వాల్సిందే. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే ఇపుడు ఇన్చార్జీలుగా ఉన్నవారికే రేపటి ఎన్నికల్లో టికెట్లు ఇస్తారనే గ్యారెంటీ లేదు. తమకు టికెట్లు ఇస్తామనే గ్యారెంటీ కావాలని తమ్ముళ్ళు అడుగుతుంటే చంద్రబాబు మాట్లాడటం లేదు. టికెట్ వస్తుందనే గ్యారెంటీ లేనపుడు పార్టీ కార్యక్రమాలను తాము ఏ విధంగా నిర్వహిస్తామని నేతలు అడుతున్నారు. దీనికి చంద్రబాబు దగ్గర సమాధానంలేదు.
పార్టీ కార్యక్రమాల పేరుతో ఇపుడు లక్షల రూపాయలు ఖర్చులు పెట్టుకున్న తర్వాత టికెట్ ఇచ్చేది లేదంటు అప్పుడు తాము ఏమి చేయాలని తమ్ముళ్ళు గట్టిగానే నిలదీస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్నపుడు అన్నీ విధాలుగా ఆకాశమే హద్దుగా రెచ్చిపోయిన చాలమంది నేతలు ఇఫుడు అడ్రస్ కూడా కనబడటంలేదు. అప్పట్లో ఇలాంటి వారిని బాగా ప్రోత్సాహించిన చంద్రబాబు ఇఫుడు గట్టి నేతల కోసం వెతుక్కునేందుకు అవస్తలు పడుతున్నారు.
ఈ విషయాలన్నింటినీ పక్కనపెట్టేసినా ఎన్నికల్లో టీడీపీకి ఏ పార్టీతో పొత్తుంటుందో క్లారిటి లేదు. జనసేన పార్టీతో పొత్తుపెట్టుకుంటే ఎన్ని సీట్లు కేటాయిస్తారు ? ఏ సీట్లు ఇచ్చేస్తారనే విషయంలోనే అయోమయం ఉంది. టీడీపీ ఒంటిరిగా పోటీచేయదనే విషయంలో తమ్ముళ్ళకు క్లారిటి ఉన్నా ఎవరితో పొత్తులుంటాయో మాత్రం చెప్పలేకపోతున్నారు. ఇపుడు తాము కష్టపడి కార్యక్రమాలు నిర్వహించినా రేపు ఇంకెవరికైనా టికెట్లు ఇచ్చేస్తే అప్పుడు తమ కష్టం ఏమవ్వాలని తమ్ముళ్ళు అడుగుతున్నారు.
అలాగే పొత్తుల్లో భాగంగా తమ నియోజకవర్గాలను ఇతర పార్టీలకు ఇచ్చేస్తే తామేంచేయాలనే విషయంలో తమ్ముళ్ళల్లో అయోమయం పెరిగిపోతోంది. అయితే చంద్రబాబు మాత్రం తమ్ముళ్ళ ప్రశ్నలకు సమాధానాలు చెప్పటంలేదు. అందుకనే పార్టీ కార్యక్రమాలను నిర్వహించటానికి, డబ్బులు ఖర్చు పెట్టడానికి నేతలు వెనకాడుతున్నారు. పొత్తులు, టికెట్లపై స్పష్టత ఇవ్వకపోతే తమ్ముళ్ళెవరు ముందుకొచ్చే పరిస్ధితి లేదు. మరిలాంటి అంశాలపై తమ్ముళ్ళకు స్పష్టత వస్తుందేమో చూడాలి.