Begin typing your search above and press return to search.
తమ్ముళ్ళే పరువు తీస్తున్నారా... ?
By: Tupaki Desk | 8 Jan 2022 12:30 AM GMTచంద్రబాబు అపర చాణక్యుడు. ఎదురులేని నాయకుడు. ఆయన తలచుకుంటే ఎంతటి వారు అయినా చిత్తు కావాల్సిందే. ఇది కదా తెలుగుదేశం తమ్ముళ్ళు నిత్యం చెప్పుకునేది. ఇక చంద్రబాబు విజనరీ అని, ఆయననే జనం మెచ్చి పట్టం కడతారు అని కూడా చెబుతారు. ఎన్నికలు ఎపుడు వచ్చినా కూడా చంద్రబాబే సీఎం అయి తరచూ ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడుతో సహా అంతా గట్టిగా చెబుతూంటారు. అలాంటి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కుప్పంలో పర్యటించినపుడల్లా ఆయన గాలిని తమ్ముళ్ళే తీసేస్తున్నారు.
ఇది పగవారు, ప్రత్యర్ధి పక్షం వారు చేయడంలేదు. తమ్ముళ్ళే తీరి కూర్చుని చేస్తున్నారు. బాహాటంగానే బాబుతో వారు ఆడుకుంటున్నారు. ఆ మధ్యన చంద్రబాబు కుప్పంలో టూర్ చేస్తే జూనియర్ ఎన్టీయార్ ని పార్టీలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఆయన వల్లనే పార్టీ లేస్తుంది అన్న ఆర్ధం వచ్చేలా తమ్ముళ్లు సూచనలు చేశారు. అయితే నాడు బాబు దానికి పెద్దగా రియాక్ట్ కాలేదు. మరి బాబు మదిలో ఏముందో తెలియదు కానీ అలా ఆయన సైలెంట్ అయ్యారు.
ఇక లేటెస్ట్ గా చూసుకుంటే చంద్రబాబు కుప్పం టూర్లో మళ్ళీ ఇలాగే డిమాండ్లు వచ్చి పడ్డాయి. ఈసారి తమ్ముళ్ళు జనసేనాని పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకోమంటున్నారు. ఆయనతో జత కట్టి అధికారంలోకి రమ్మంటున్నారు. మరి సింగిల్ గా టీడీపీ ఎన్నికలకు వెళ్తే ఆ పార్టీ పరాజయం పాలు అవుతుంది అన్నాది తమ్ముళ్ళకూ తెలిసిపోయిందా అన్నదే ఇక్కడ పాయింట్. అంతే కాదు, చంద్రబాబుకు వయసు అయిపోయింది అనుకుంటే భావి వారసుడిగా లోకేష్ బాబు ఎటూ ఉన్నారు.
ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ తాను చంద్రబాబు మాదిరిగా మెతక కాదు, ఫైర్ బ్రాండ్ అని చెప్పుకున్నారు. మరి లోకేష్ బాబు మీద తమ్ముళ్ళకు నమ్మకాలు లేవా అన్న కొత్త డౌట్లు కూడా వచ్చి పడుతున్నాయి. పైగా చంద్రబాబు అంతటి వాడు, ఆరు సార్లు కుప్పం జనాలు గెలిపించిన నాయకుడు తమ వూరికి వస్తే ఆయన శక్తి సామర్ధ్యాలనే శంకించేలా ఫలానా వారుని తెచ్చిపెట్టుకుంటే గెలుస్తారు సారూ అంటూ సలహాలు ఇవ్వడమేంటి అన్నదే చర్చగా ఉంది.
నిజానికి టీడీపీ గెలవాలన్న తపన తాపత్రయం క్యాడర్ కి ఉంటే సొంతంగా పార్టీని బలోపేతం చేసుకోవాలి. టీడీపీ ఏమీ చిన్న పార్టీ కాదు, బాబే స్వయంగా చెప్పుకున్నట్లుగా 22 ఏళ్ల పాటు అధికారంలో ఉంది. మరో ఇరవై పాటు ప్రధాన ప్రతిపక్షంలో ఉంటూ కీలకమైన భూమిక పోషిస్తోంది. అలాంటి టీడీపీని తామే చిన్నగా చేసుకుంటూ తమ పార్టీ బలహీనతను, తన నాయకత్వం వీక్ నెస్ ని ఇలా బాహాటంగా బయటేసుకుంటే అది టీడీపెకి తీవ్ర స్థాయిలో నష్టం కలిగిస్తుంది ఆన్న సోయి అయినా ఉందా లేదా అన్నది కూడా చర్చగా ఉంది. మొత్తానికి అధినాయకుడు చంద్రబాబు సొంతంగా గెలవలేరు అని తమ్ముళ్ళే చెప్పడం చూస్తూంటే కుప్పం షాకులు మరెన్ని టీడీపీకి ఉంటాయో అనిపించకమానదు.