Begin typing your search above and press return to search.
మంత్రులంతా హ్యాపీగా ఉండొచ్చు.. ఆ నలుగురూ మాత్రం.. ?
By: Tupaki Desk | 12 Jan 2022 1:30 AM GMTమొత్తానికి జగన్ ఈ విషయంలో కూడా రివర్స్ అంటున్నట్లుగానే సీన్ ఉందిట. సగం పాలన తరువాత మొత్తం మంత్రుల్లో తొంబై శాతం మందిని మార్చేస్తాను అంటూ జగన్ తొలి రోజునే చెప్పారు. అయితే చెప్పిన కాలం పూర్తిగా జరిగిపోయింది. ముందుకు సాగిపోతోంది కూడా. కానీ ఏపీలో మంత్రి వర్గ విస్తరణ ఊసే లేకుండా పోయింది. ఏపీలో మంత్రులను మారుస్తారా లేదా అన్న చర్చ కూడా వస్తోంది.
అయితే జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే మంత్రి వర్గ విస్తరణ అన్నది ఇప్పట్లో ఉండబోదని అంటున్నారు. ఒక విధంగా ఇది మంత్రులకు గుడ్ న్యూసే అని చెబుతున్నారు. మరో నాలుగు నెలల్లో మూడేళ్లు పూర్తి చేసుకోబోతున్న క్రమంలో కొత్తగా తొంబై శాతానికి మంత్రులను తీసుకుంటే రాజకీయ కధ మొదటికి వస్తుంది అన్న ఆలోచనలు ఏవో ప్రభుత్వ పెద్దలలో ఉన్నాయట.
నిజానికి ఏపీ ఎన్నడూ లేని విధంగా అనేక ఇబ్బందుల్లో ఉంది. ముఖ్యంగా ఆర్ధికంగా ఏపీ నానా కష్టాలు పడుతోంది. ఇక ప్రజా వ్యతిరేకత కూడా నెమ్మదిగా అలముకుంటోంది. ఈ నేపధ్యంలో విపక్షాలు కూడా వచ్చిన అవకాశాన్ని వాడుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. దాంతో కొత్తగా మంత్రులను తీసుకుని వారితో కొత్తగా పాలన మొదలుపెడితే ఫ్రెష్ నెస్ మాట పక్కన పెట్టి చాలా ఇబ్బందులు రాజకీయంగా వస్తాయని ఆలోచిస్తున్నారుట.
ఇక కొత్తవారు తమ శాఖల మీద పూర్తి పట్టు సాధించి రంగంలోకి దిగేసరికి పుణ్యకాలం కూడా గడచిపోతుంది అన్న ఆలోచనలూ ఉన్నాయని చెబుతున్నారు. ఇక అన్ని రకాల సమీకరణలు చూసుకునే మంత్రివర్గాన్ని నాడు ఏర్పాటు చేసినందువల్ల ఇపుడు విస్తరణ పేరిట ఏమైనా మార్పు చేర్పులు చేసినా దాన్ని వల్ల పార్టీలో అసంతృప్తి కూడా రేగుతుంది అన్న దూరాలోచన కూడా ఉందని చెబుతున్నారు.
దీంతో మంత్రి వర్గ విస్తరణ యత్నాలు ఉండకపోవచ్చు అంటున్నారు. అదే టైమ్ లో పనితీరు సరిగ్గా లేని నలుగురు మంత్రులను మార్చేయడం ద్వారా ఇదే క్యాబినేట్ ని ఎన్నికల దాకా కంటిన్యూ చేయాలన్నది జగన్ ఆలోచనగా చెబుతున్నారు. పనితీరు సరిగ్గా లేని మంత్రులలో రాయలసీమ నుంచి ఇద్దరు, కోస్తా జిల్లా నుంచి ఒకరు, ఉత్తరాంధ్రా నుంచి ఒకరు ఉన్నారట. మరి ఆ బ్యాడ్ లక్ మినిస్టర్స్ ఎవరో చూడాలి. ఏది ఏమైనా పాతిక మంది మంత్రులలో తొంబై శాతం మంత్రులు ఫుల్ ఖుషీ అనే చెప్పాలి మరి.