Begin typing your search above and press return to search.
సినిమాటికెట్ల ధరలు తగ్గించారు సరే.. పెట్రోల్ మీద వ్యాట్ తగ్గించరేం?
By: Tupaki Desk | 24 Dec 2021 4:41 AM GMTజనం కోసం.. వారి బాగు కోసం.. వారి మీద ఎలాంటి భారం పడకుండా ఉండేలా చూసేందుకు ఏపీలోని జగన్మోహన్ సర్కారు తపిస్తున్న తీరు మామూలుగా లేదు. ఇప్పటివరకు అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వం కూడా వ్యవహరించని వైఖరితో.. సినీ పరిశ్రమకు చుక్కలు చూపిస్తున్నారు. ఇదంతా కూడా సాదాసీదా జనాల కోసం. వారి మీద భారం పడకుండా ఉండాలన్న సదుద్దేశంతో సినిమా టికెట్ల ధరల్ని భారీగా తగ్గించేయటం ద్వారా.. సినిమా అనే వినోదాన్ని అందరికి అందుబాటులోకి తేవాలన్న తపన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఏపీ మంత్రి కన్నబాబు మాటల్లో చెప్పాలంటే.. ప్రజల పై భారం పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాల పై ఉంటుందని.. అదే బాధ్యతను నిర్వర్తిస్తుంటే ఎందుకంత బాధ అంటూ ఆగ్రహంగా ప్రశ్నిస్తున్నారు. నిజమే.. జనం గురించి ఆలోచించే ప్రభుత్వాలకు ఆ మాత్రం ఆవేశం.. ఆగ్రహం ఉండాల్సిందే. వినోదం కోసం వెళ్లే సినిమాను వంద రూపాయిలు పెట్టేసి.. జనం సొమ్ము లాగేస్తారా? ఇప్పటివరకు ఈ దోపిడీ మీద ఏ ప్రభుత్వం ఫోకస్ చేయలేదు.
ప్రజల కోసం.. ప్రజల బతుకుల్ని పూర్తిగా మార్చేయాలన్న సదుద్దేశంతో వచ్చిన జగనన్న సర్కారు కాబట్టి.. సినిమా అంతు చూస్తోంది కానీ.. ఇంకెవరైనా సరే ఈ సాహసం చేస్తారా? చెప్పండి. మూడు గంటల వినోదానికి వంద.. రెండు వందలు కాదు.. రూ.పది లేదంటే రూ.పాతిక లోపే టికెట్ల ధరలు ఉండాలన్న తీరును ప్రదర్శిస్తున్న ప్రభుత్వం దెబ్బకు థియేటర్ల యజమానుల కూసాలు కదిలిపోతున్నాయి. ఇంతటి ఘనకార్యం చేస్తున్న జగన్ ప్రభుత్వం.. సామాన్యులు చేస్తున్న డిమాండ్ ను మాత్రం ఎందుకు పట్టించుకోవటం లేదు.
ఎవరి ఒత్తిడి లేకుండా.. తనకు నచ్చి వెళ్లే సినిమా టికెట్ల విషయంలోనే ఇంత పంతంగా ఉంటూ.. దాని సంగతి చూడాలన్నట్లుగా వ్యవహరిస్తున్న జగన్ ప్రభుత్వం.. రాష్ట్ర ప్రజలందరూ పెట్రోల్.. డీజిల్ కు సంబంధించి రాష్ట్రాలు వసూలు చేసే భారీ వ్యాట్ ను తగ్గించే విషయం మీద ఎందుకు ఆలోచించరు? సినిమా టికెట్ల ధరల తగ్గింపు కోసం తపించే జగన్ సర్కారు.. లీటరు పెట్రోల్ మీద రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసే రూ.30 ప్లస్ (సుమారు) పన్ను పోటును ఎందుకు తగ్గించరు? సినిమా చూడకున్నా బతుకు నడిచి పోతుంది. కానీ.. పెట్రోల్.. డీజిల్ అన్నది వినియోగించుకోకుండా బతికి బట్టకట్టటం సాధ్యం కాదు. అలాంటప్పుడు పెట్రోల్.. డీజిల్ మీద వ్యాట్ భారాన్ని తగ్గించేందుకు జగన్ సర్కారు ఎందుకు నిర్ణయం తీసుకోనట్లు చెప్మా?