Begin typing your search above and press return to search.

ప్ర‌ధాని మోడీ లెక్క‌లు త‌ప్పంటోన్న నెటిజ‌న్లు!

By:  Tupaki Desk   |   13 Feb 2020 1:23 PM GMT
ప్ర‌ధాని మోడీ లెక్క‌లు త‌ప్పంటోన్న నెటిజ‌న్లు!
X
ప్ర‌ధానిగా న‌రేంద్ర మోడీ 2014లో బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత ఆదాయ‌పు పన్ను చెల్లింపుల‌పై దృష్టి పెట్టిన సంగ‌తి తెలిసిందే. నిర్ణీత ఆదాయం ఉన్న‌వారు త‌ప్ప‌ని స‌రిగా ప‌న్ను చెల్లించ‌డం ద్వారా దేశాభివృద్ధికి తోడ్ప‌డాల‌ని మోడీ ఇచ్చిన పిలుపున‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. అయితే, ఎన్ని నిబంధ‌న‌లు - సంస్క‌ర‌ణ‌లు తెచ్చినా....కొంత‌మంది పన్ను ఎగ‌వేస్తున్నార‌ని - అటువంటి వారి వ‌ల్ల నిజాయితీప‌రులైన పన్ను చెల్లింపుదారులు న‌ష్ట‌పోతున్నార‌ని మోడీ అన్నారు. పన్ను విధానంపై తాజాగా ప్ర‌వేశ‌పెట్టిన నిబంధనలు చాలా పారదర్శకంగా ఉన్నాయ‌న్నారు. అయితే, దేశంలో 1.5 కోట్ల మంది మాత్రమే పన్నులు కడుతున్నార‌ని మోడీ చేసిన వ్యాఖ్య‌ల‌పై నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.

మొత్తం జ‌నాభాలో 2200 మంది మాత్రమే కోటికిపైగా ఆస్తులు క‌లిగి ఉన్నారని వెల్ల‌డించ‌డం ఆశ్చ‌ర్య‌క‌రంగా ఉంద‌ని మోడీ చెప్పారు. అయితే, కేవలం 1.5 కోట్ల మంది మాత్ర‌మే పన్ను క‌డుతున్నార‌ని చెప్ప‌డం స‌రికాద‌ని నెటిజ‌న్లు గ‌ణాంకాల‌తో స‌హా విమ‌ర్శిస్తున్నారు. 2018 - 19లో 5.52 కోట్ల మంది ఆదాయ‌పు పన్ను దాఖ‌లు చేశార‌ని నెటిజన్లు విమ‌ర్శించారు. వారిలో 2.62 కోట్ల మంది పన్ను కట్టలేదని - 2.9 కోట్ల మంది పన్ను కట్టారని ట్వీట్ చేశారు. 2200 మంది మాత్రమే తమ ఆస్తులను రూ. కోటిగా డిక్లేర్ చేశారన్నమోడీ వ్యాఖ్యలను నెటిజ‌న్లు ఖండించారు. 2014 - 15లో 88,649 మంది - 2017-18లో 1,40,139 మంది కోటికి పైగా ఆస్తులన్నాయ‌ని డిక్లేర్ చేసినట్లు సీబీడీటీ లెక్కల‌తో స‌హా ట్వీట్ చేశారు. మ‌రి ప్ర‌ధాని చెప్పిన గ‌ణాంకాలు త‌ప్పుల త‌డ‌క‌ని ఘాటుగా విమ‌ర్శిస్తున్నారు.