Begin typing your search above and press return to search.
ఆ అప్పడాలు తింటే కరోనా మీ దరి చేరదట!
By: Tupaki Desk | 25 July 2020 1:30 AM GMTకరోనా వైరస్ మహమ్మారి ఒక్కటే కాదు, దాని అమ్మమ్మ, జేజేమ్మ కూడా ఇప్పుడు మనల్ని ఏమీ చేయలేదు. ఏంటీ నిజమేనా ? వ్యాక్సిన్ వచ్చేసిందా ? అని సంతోష పడుతున్నారా ? కరోనా వ్యాక్సిన్ అయితే వచ్చేసింది. కానీ ,అది శాస్త్రవేత్తలు ల్యాబ్ లో తయారుచేసిన వ్యాక్సిన్ కాదు. కేంద్రమంత్రి తయారుచేసిన వ్యాక్సిన్. ఇదేంటి ఈ మధ్య కేంద్రమంత్రులు ఈ మధ్య వ్యాక్సిన్లు కూడా తయారుచేస్తున్నారా? అని అనుకుంటున్నారా ఇది ల్యాబ్ లో తయారైన వ్యాక్సిన్ కాదు .. ఆయిల్ లో తయారైన వ్యాక్సిన్. రెండు మూడు భాబీజీ పాపడ్ లు తింటే కరోనా ఎగిరిపోతుందని కేంద్రమంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ తాజాగా సెలవిచ్చారు.
కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచమంతా అష్టకష్టాలు పడుతుంటే, కేంద్రమంత్రి పాపడ్ తింటే కరోనా పారిపోతుంది అని చెప్పారు. ఆయన చెప్పిన ఈ రెండు ముక్కలే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జలవనరులు, గంగా ప్రక్షాళన, పార్లమెంటరీ మంత్రిత్వ శాఖలను నిర్వర్తిస్తున్న ఈ మంత్రివర్యులు ఈ వీడియోలో పాపడ్‌ను చూపిస్తూ కనిపించారు, అంతటితో ఆగకుండా ఈ పాపడ్ లు కరోనాతో పోరాడే యాంటీ బాడీలను తయారు చేస్తాయని చెప్పుకొచ్చారు. దాంతో పాటు భాబీజీ పాపడ్ ఉత్పత్తిదారులపై అభినందనలు, ప్రశంసలు కురిపించారు. అత్మనిర్భర్ భారత్ పథకం కింద తయారీదారులు ‘బాబ్జీ పాపడ్’ను తయారుచేశారు. ఇది కరోనా వైరస్‌ను జయించేందుకు చాలా బాగా తోడ్పడగలదు. వారికి నా శుభాకాంక్షలు. వారికి విజయం లభించాలని కోరుకుంటున్నా అని మేఘ్వాల్ చెబుతున్నట్టు సదరు వీడియో లో వినిపిస్తోంది.
ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ కనిపెట్టడం కోసం ప్రపంచదేశాలు, అనేక కంపెనీలు పెద్ద ఎత్తున పరిశోధనలు చేస్తున్న విషయం తెలిసిందే. వ్యాక్సీన్ వచ్చేవరకు వైరస్ వ్యాప్తిని నిలువరించేలా ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో ఆర్థిక వ్యవస్థ సైతం కుదేలయ్యింది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రమంత్రి మేఘ్వాల్ వీడియో సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేసారు.