Begin typing your search above and press return to search.

అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు

By:  Tupaki Desk   |   10 April 2020 1:00 PM GMT
అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు
X
40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు.. రాజకీయాల్లో ఎంతో సీనియర్. అంతటి నేత కరోనాకు భయపడి తెలంగాణకు పారిపోయి హైదరాబాద్ లో దాక్కొని అక్కడి నుంచి ఏపీని ఉద్దరిస్తానంటూ ప్రసంగాలు - ప్రకటనలు ఇస్తున్నారు. ఏపీలో లేకుండా ఏపీ ప్రజల కోసం పాటుపడుతున్న బాబు గారి తాపత్రయంపై ఇప్పటికే విమర్శలు చెలరేగుతున్నాయి..

తాజాగా హైదరాబాద్ లో ఖాళీగా ఉన్న చంద్రబాబు తన 40 ఏళ్ల అనుభవాన్ని రంగరించి చేస్తున్న ట్వీట్లు నవ్వుల పాలవుతున్నాయి. ఒకటా రెండా? బాబు గారు ట్వీట్ చేయడం నెటిజన్లు ఉతికి ఆరేయడం కనిపిస్తోంది. తాజాగా చంద్రబాబు ట్వీట్ చేస్తూ ‘లాక్ డౌన్ సమయంలో రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షలివ్వాలని’ డిమాండ్ చేశారు.

దీనిపై నెటిజన్లు కడిగిపారేస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో రోడ్డెక్కడం నిషేధం.. 3 కి.మీల పరిధి దాటకూడదు. అది నిత్యావసరాలకే. అలాంటి రోడ్డెక్కి ప్రమాదంలో మరణించారంటే అది తీవ్రమైన నేరమే. లాక్ డౌన్ లో రహదారులపై ప్రయాణమే నిషేధం. నిషేధం ఉల్లంఘించి చనిపోయిన వారికి రూ.5 లక్షలు ఇవ్వాలన్న చంద్రబాబు డిమాండ్ అర్థరహితం. ఇదే ఆయనను నవ్వులపాలు చేస్తోంది.

40 ఏళ్ల రాజకీయం అనుభవం ఉన్న వ్యక్తి ఆ మాత్రం ఐడియా లేకుండా గుడ్డిగా ట్వీట్ చేయడమే ఇప్పుడు నెటిజన్లను కూడా ఆశ్చర్యపరుస్తోంది. ఆయనను విమర్శలతో ఉతికి ఆరేయడానికి అవకాశం కల్పిస్తోంది.