Begin typing your search above and press return to search.
చినబాబును తెగ రోస్ట్ చేసేస్తున్నారుగా!
By: Tupaki Desk | 11 Feb 2019 1:44 PM ISTఏపీ మంత్రి - టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అంటే నెటిజన్లకు చాలా 'మక్కువ'. తరచూ వింత వాదనలు, హాస్పాస్పద వ్యాఖ్యలు చేస్తూ వారిని ఆయన అలరిస్తుండటమే అందుకు కారణం! అందుకే 'లోకేశం' అంటూ ఆయన్ను ముద్దుగా పిల్చుకుంటుంటారు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారా.. సోషల్ మీడియాలో ఏం కామెంట్లు పెడతారా అని ఎదురుచూస్తూ ఉంటారు. పదే పదే ఆయన్ను ట్రోల్ చేస్తుంటారు.
తాజాగా ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ టూర్ కు విచ్చేశారు. ఆయన పర్యటనను విమర్శిస్తూ చినబాబు చాలా ట్వీట్లు పోస్ట్ చేశారు. పనిలో పనిగా ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పై కూడా విమర్శలు చేశారు. ప్రత్యేక హోదా కోసం తాము పోరాడుతుంటే జగన్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఇంకేముంది.. ట్రోలర్లు పండగ చేసుకుంటున్నారు. లోకేశ్ వ్యాఖ్యల్లో తప్పులు ఎంచుతూ తెగ రోస్ట్ చేస్తున్నారు. ఆయనకు పలు రకాల ప్రశ్నలు సంధిస్తున్నారు.
సమాధానం చెప్పాలంటూ లోకేశ్ కు నెటిజన్లు సంధిస్తున్న ప్రశ్నల్లో కొన్ని..
1. నాలుగేళ్లపాటు బీజేపీతో సంసారం చేసినప్పుడు టీడీపీ ప్రత్యేక హోదా ఎందుకు అడగలేదు?
2. ప్రతిపక్ష నేత జగన్ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తుంటే కేసులు పెట్టి అడుగడుగునా అడ్డుకుంది ఎవరు?
3. ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ విశాఖలో జగన్ తలపెట్టిన నిరసన కార్యక్రమానికి వెళ్తుండగా విమానాశ్రయంలోనే పలువురిని అడ్డుకుని అరెస్టులు చేసిందెవరు?
4. హోదా పేరు ఎత్తితే జైల్లో పెడాతమని బెదిరించింది ఎవరు?
5. హోదా వద్దు - ప్యాకేజీ ముద్దు అని చెప్పిందెవరు?
6. జగన్ పాదయాత్ర చేయకపోయి ఉంటే అసలు మీరు హోదా కోసం ఇప్పుడు పోరాడేవారా?
ప్రధాని మోదీని లోకేశ్ కుమారుడు దేవాన్స్ మోదీ తాతా అని పిలిచిన విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు. 'చినబాబూ.. మీ కుమారుడు దేవాన్స్ మోదీనికి ఇంకా తాతా అని పిలుస్తున్నాడా? సోనియా గాంధీని అమ్మమ్మా.. అని సంబోధిస్తున్నాడా?' అంటూ చురకలంటించారు.