Begin typing your search above and press return to search.

అచ్చెన్న అతితెలివి..ఖాతాలో 10 వేలట

By:  Tupaki Desk   |   30 March 2021 5:30 AM GMT
అచ్చెన్న అతితెలివి..ఖాతాలో 10 వేలట
X
తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో ఓటర్లను ఆకర్షించేందుకు టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అతి తెలివిని ప్రదర్శిస్తున్నారు. తిరుపతిలో మాట్లాడుతు అధికారపార్టీ నేతల ధౌర్జన్యాలను, వాలంటీర్ల బెదిరింపులను తమకు జనాలు వీడియో రికార్డింగులు పంపాలన్నారు. అలా పంపిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతారట. అలాగే వీడియో రికార్డింగులు పంపిన ప్రతి ఒక్కళ్ళకు వాళ్ళ ఖాతాల్లో రూ. 10 వేలు జమచేస్తామని అచ్చెన్న చెప్పటమే విచిత్రంగా ఉంది.

తమకు వీడియో రికార్డింగులు పంపటానికంటు ఓ వాట్సప్ నెంబర్ ను కూడా ప్రకటించారు. నిజానికి ఎన్నికలన్నాక అనేక ప్రాంతాల్లో చిన్నవో పెద్దవో గొడవలు జరుగుతునే ఉంటాయి. అలాగే ప్రచారం సమయంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడుతుంటారు. కొందరు స్ధానిక నేతలు ప్రచారంలో భాగంగా బెదిరింపులు, ప్రలోభాలకు గురిచేయటం కూడా అత్యంత సహజమే. ఈ పరిస్దితి ఏ ఒక్కపార్టీకో పరిమితం కాదు. అవకాశం ఉన్న ప్రతి పార్టీ నేత ఇదే పనిచేస్తారనటంలో సందేహంలేదు.

కానీ టీడీపీ మాత్రం కొత్తగా తమకు వీడియోలు పంపండి తాము పంపిన వాళ్ళ ఖాతాల్లో పదివేల రూపాయలు వేస్తామంటే ఏమిటర్ధం ? ఓటర్లకు రూ. 10 వేలు ఇవ్వటానికి టీడీపీ రెడీగా ఉందా అనే అనుమానాలు పెరుగుతున్నాయి. ఎవరైనా వీడియోలు పంపితే వాటిని అవసరార్దం ఉపయోగించుకుంటారే కానీ పంపినవారికి ఏ పార్టీ కూడా డబ్బులివ్వదు. ఈ విషయం తెలిసీ అచ్చెన్న రూ. 10 వేలు ఖాతాలో జమచేస్తామని ప్రకటించటంలోనే ఓట్లకు డబ్బులు వేయటానికి ఇదొక కొత్త మార్గమని తెలిసిపోతోంది.

అధికారపార్టీ ధౌర్జన్యాలు, వాలంటీర్ల ప్రలోభాలను వీడియోలు తీసి పంపాలని అడగటంలో తప్పులేదు. కానీ ప్రతి వీడియోకు రూ. 10 వేలిస్తామని చెప్పటమే అనుమానంగా ఉంది. నిజానికి ఏ ఎన్నికైనా అధికారపార్టీకే అనుకూలంగా ఉంటుందనటంలో సందేహంలేదు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు జరిగిన నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నికలో టీడీపీ అభ్యర్ధి ఎలా గెలిచారు ? అప్పట్లోనే జరిగిన స్ధానికసంస్ధల కోటాలో భర్తీ అయిన మూడు ఎంఎల్సీల ఎన్నికల్లో టీడీపీ ఎలా గెలిచిందో అచ్చెన్న మరచిపోయినట్లున్నారు.