Begin typing your search above and press return to search.
నా భార్య అలా చేస్తే.. నా తప్పేంటి? నెటిజన్లకు ఇర్ఫాన్ స్ట్రాంగ్ కౌంటర్..!
By: Tupaki Desk | 27 May 2021 12:30 AM GMTఇర్ఫాన్ పఠాన్ ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ఇజ్రాయేల్.. పాలస్తీనా విషయంలో పఠాన్ పెట్టిన ఓ పోస్ట్ వివాదాస్పదమైంది. ఈ విషయంపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇర్ఫాన్ ను విమర్శించింది. మన దేశంలోని పశ్చిమ బెంగాల్ లో హిందువులు మీద దాడులు జరిగితే ఇర్ఫాన్ పఠాన్ కనీసం స్పందించడు. కానీ ఎక్కడ ఇజ్రయేల్.. పాలస్తీనా గొడవ విషయంలో మాత్రం జోక్యం చేసుకుంటాడు. అంటూ కంగనా రనౌత్ విమర్శలు గుప్పించింది.
దీనికి పఠాన్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. తనకు మానవత్వం ఉందని.. ఓ మనిషిలా స్పందించానని.. కుల మతాలను తాను పట్టించుకోలేదంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. ఈ విషయంలో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి దుమ్మెత్తి పోసుకున్నాయి. ఓ వర్గం కంగనాకు మద్దతుగా పోస్టులు పెట్టగా.. మరో వర్గం పఠాన్ కు మద్దతుగా నిలిచింది. ఇదిలా ఉంటే తాజాగా ఇర్ఫాన్ పఠాన్ మరోసారి నెటిజన్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఇంతకీ విషయం ఏమిటంటే..
ఇర్ఫాన్ పఠాన్ భార్య.. తన కుమారుడి అకౌంట్ నుంచి ఓ పిక్ పోస్టు చేసింది. ఈ పిక్ లో పఠాన్ భార్య తన మొఖాన్ని బ్లర్ చేసింది. అయితే ఈ విషయంపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ఇర్ఫాన్ పఠాన్ భార్య తన పిక్ బ్లర్ చేసుకోవడం పట్ల ఇష్టారాజ్యంగా కామెంట్లు పెట్టారు. ఓ వైపు ఇర్ఫాన్ పఠాన్ ను ట్రోల్ చేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో రచ్చరచ్చగా మారింది. ఈ ట్రోలింగ్ తో విసుగెత్తిన ఇర్ఫాన్ పఠాన్ ఈ విషయం పై నేరుగా స్పందించారు.
'నా భార్య తన ఫొటోను బ్లర్ చేసి పెట్టుకుంది. అది ఆమె వ్యక్తిగత విషయం. మీకు వచ్చిన సమస్య ఏమిటి? నేను ఆమెకు భర్తను మాత్రమే. ఆమెకు యజమానిని కాదు. ఆమె చేసే ప్రతి చర్యకు నేను బాధ్యుడిని కాను. అయినా ఫొటో పెట్టడం .. బ్లర్ చేసుకోవడం వ్యక్తిగత విషయం’ అంటూ నెటిజన్లకు స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చాడు ఇర్ఫాన్ పఠాన్. మొత్తానికి ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.