Begin typing your search above and press return to search.

పుడచేరి కాదు పుదుచ్చేరి లోకేశా.. కాస్త ప్రాక్టీస్ చేసి రావొచ్చుగా?

By:  Tupaki Desk   |   6 April 2021 4:10 AM GMT
పుడచేరి కాదు పుదుచ్చేరి లోకేశా.. కాస్త ప్రాక్టీస్ చేసి రావొచ్చుగా?
X
నలుగురు ఎదుట మాట్లాడే ముందు.. తాము చెప్పే మాటల్ని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే.. అభాసుపాలు కావాల్సిందే. తమ కంటే.. తమ ప్రత్యర్థులు బలం ఎక్కువగా ఉన్నప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. రాజకీయ నేత అన్న తర్వాత.. వారి నోటి నుంచి వచ్చే మాటల్లో కొన్ని తప్పులు దొర్లొచ్చు. అయితే.. ఆ తప్పులేవీ లెక్కలోకి తీసుకోని రీతిలో ఉంటే బాగుంటుంది. అందుకు భిన్నంగా.. ప్రజలు ఎటకారం చేసుకునేలా.. కామెడీ చేసుకునేలా ఉండటం మాత్రం సరికాదు.

తాజాగా జరుగుతున్న తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఆయన తీరు సిత్రంగా ఉంటోంది. మొన్నటికి మొన్న తమ పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మీని గెలిపిస్తే.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గుతాయన్న మాట చెప్పి అందరికి షాకిచ్చారు.ఒక ఎంపీ స్థానం గెలుపుతోనే.. కేంద్రం పరిధిలో ఉండే పెట్రోల్.. డీజిల్ ధరల్ని ఎలా తగ్గిస్తారన్న ప్రశ్న పలువురి నోట రావటమే కాదు.. లోకేశ్ ప్రసంగాన్ని పిచ్చ లైట్ తీసుకోవాలన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఇది సరిపోనట్లుగా..ఆయన మాటల్లో కొరవడే స్పష్టత.. అక్షరదోషాలతో పాటు.. కొన్ని పదాల్ని పలికే విషయంలోనూ ఆయన తప్పుల మీద తప్పులు చేస్తుంటారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న పుదుచ్చేరిని.. పుడచేరిగా పిలవటం కామెడీగా మారింది. లోకేశ్ నోటి నుంచి అదే పనిగా దొర్లొతున్న తప్పులు.. దానిపై సోషల్ మీడియాలో సాగుతున్న ట్రోలింగ్ తెలుగు తమ్ముళ్లకు కొత్త తలనొప్పిగా మారింది. ఇదంతా చూసినప్పుడు..తాను మాట్లాడాలన్న విషయాల్ని ముందస్తుగా అనుకోవటం.. కొన్ని కష్టమైన పదాల్ని ఒకటికి పదిసార్లు ప్రాక్టీస్ చేసుకొని వస్తే.. ఇప్పుడు ఎదుర్కొనే ఇబ్బందికర పరిస్థితులు ఎదురుకావన్నది మర్చిపోకూడదు. ఇప్పటికైనా కళ్లు తెరుస్తావా లోకేశా?