Begin typing your search above and press return to search.

విప్రో చైర్మన్ పై నెటిజన్ల ట్రోల్స్.. ప్రేమ్ జీ ఇది మోసం కాదా?

By:  Tupaki Desk   |   26 Aug 2022 2:30 AM GMT
విప్రో చైర్మన్ పై నెటిజన్ల ట్రోల్స్.. ప్రేమ్ జీ ఇది మోసం కాదా?
X
టెక్ ఇండస్ట్రీలో మూన్ లైటింగ్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. మూన్ లైటింగ్ అంటే వర్క్ ఫ్రం హోం పేరిట ఇంట్లో ఉంటున్న ఉద్యోగులు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు చేస్తూ సంపాదించుకుంటున్నారు. ఒక కంపెనీకి తెలియకుండా మరో కంపెనీలో ఏకకాలంలో రెండు పనులు చేస్తున్నారు. ఇది మోసమని..ఉద్యోగులు అంతా కంపెనీలకు రావాలని కంపెనీలు అల్టిమేటం జారీ చేస్తున్నాయి.

ఇలా మూన్ లైటింగ్ చేయడం ‘మోసం’తో సమానమని విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్ జీ శనివారం పేర్కొన్నాడు. దీనిపై ట్విట్టర్ లో నెటిజన్లు ఘాటుగా ఆయనకు వ్యతిరేకంగా కౌంటర్లు ఇస్తున్నారు. ‘టెక్ ఉద్యోగులు ఒకటికి మించి ఉద్యోగాలు చేయకూడదు. సరే. మరీ ప్రొఫెషనల్స్ సంగతేంటి? ఖాళీ సమయాల్లో వాళ్లేం చేస్తున్నారో పట్టించుకోరా? అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.

మూన్ లైటింగ్ అనేది ఔట్ డేటెడ్ అని.. ఆఫీసు పనివేళల్లో మేము చేసే పనిపై పూర్తి శ్రద్ధ కనబరుస్తామని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఆఫీస్ అవర్స్ తర్వాత ఉద్యోగులు ఏం చేస్తారనేది కంపెనీకి అనవసరం అంటూ లింక్డ్ ఇన్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ షహ్ బాజ్ కౌంటర్ ఇచ్చాడు.

ఇక ఉద్యోగుల ప్రస్తుత పనిపై మూన్ లైటింగ్ ప్రతికూల ప్రభావం చూపనంత వరకూ అది మోసం కాదంటూ ఐఓసీఎల్ కెమికల్స్ సీఈవో సైతం ఉద్యోగులనే సమర్థించారు. ఆఫీస్ వెలుపల ఉద్యోగులను నియంత్రించే హక్కు మీకు లేదని.. ఇది హాస్యాస్పదమైన స్టేట్ మెంట్ అని స్పష్టం చేస్తున్నారు.

కంపెనీల ప్రమోటర్లు ఇతర కంపెనీలు, బోర్డుల్లో డైరెక్టర్లుగా కొనసాగుతున్నారని..ఇది మూన్ లైటింగ్ అవుతుందే కానీ.. మోసం కాదంటూ పేర్కొంటున్నారు.

ఇక మిస్టర్ రిషద్ ప్రేమ్ జీ.. ‘మీరు 7కంపెనీలకు డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఇది మూన్ లైటింగ్ కాదా? మూన్ లైటింగ్ ఉద్యోగుల హక్కు’ అని నెటిజన్లు కౌంటర్ ఇస్తున్నారు. ప్రేమ్ జీ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురవుతున్నారు.