Begin typing your search above and press return to search.

ఎలాన్ మాస్క్ మరో అద్భుత ప్రయోగం 'న్యూరాలింక్ చిప్'..!

By:  Tupaki Desk   |   1 Dec 2022 10:40 AM GMT
ఎలాన్ మాస్క్ మరో అద్భుత ప్రయోగం న్యూరాలింక్ చిప్..!
X
అపర కుబేరుడు.. టెస్లా అధిపతి ఎలాన్ మాస్క్ ఎన్నో సంచనాలకు కేరాఫ్ గా నిలుస్తున్నారు. అంగారకుడిపై స్పేస్ ఎక్స్ తో ప్రయోగాలు చేయాలన్నా.. ఎలక్ట్రిక్ కార్లను రోడ్లపై రయ్ రయ్ మని ఊరికించాలన్నా.. ప్రముఖ సోషల్ మీడియా సంస్థలను టేకోవర్ చేసుకోవాలన్నా.. ఆఖరికి కోతితో వీడియో గేమ్స్ ఆడించాలన్న ఆయనకే సాధ్యమవుతోంది.

ఇటీవలి కాలంలో అసాధ్యాలను సుసాధ్యం చేయడం ఎలాన్ మాస్క్ కు వెన్నతో పెట్టిన విద్యగా మారింది. ఈ క్రమంలోనే మరో అద్భుత ప్రయోగాన్ని ఆరునెలల్లో ప్రపంచం ముందుకు తీసుకు రాబోతున్నట్లు ఎలాన్ మాస్క్ ప్రకటించి సంచలనం సృష్టించారు. దీంతో ఎలాన్ మాస్క్ తదుపరి మిషన్ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

మాస్క్ చెందిన 'న్యూరాలింక్' సంస్థ కొన్నేళ్లుగా మనిషి మొదడును కంట్రోల్ చేసే చిప్ ను తయారు చేస్తుంది. గత ఆరేళ్ల క్రితం న్యూరాలింక్ తయారు చేసిన చిప్ తో రోబోలను ప్రదర్శించారు. నాటి కృత్రిమ మేధస్సుపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఆ తర్వాత కొంతకాలానికి ఒక కోతిపై ప్రయోగం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను అప్పట్లో ఎలాన్ మాస్క్ సోషల్ మీడియాలో విడుదల చేశారు.

ఎలాంటి జాయ్ స్టిక్ లేకుండా కోతి కంప్యూటర్లో వీడియో గేమ్ ఆడుతూ కన్పించింది. న్యూరాలింక్ చిప్ కారణంగానే ఆ కోతి ఎలాంటి డివైజ్ లేకుండానే కంప్యూటర్ ను కంట్రోల్ చేసి గేమ్ ఆడటం వీడియోలో స్పష్టంగా కనిపించింది. అయితే ఆ కోతి గత ఫిబ్రవరిలో మరణించడంతో ఎలాన్ మాస్క్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

అయితే ఈ చిప్ అందుబాటులోకి వస్తే మాత్రం సాంకేతిక పరంగా ఎన్నో మార్పులు చోటు చేసుకునే అవకాశం కన్పిస్తోంది. ఈ చిప్ ను మనిషి మెదడులో అమరిస్తే ప్రస్తుతం మనం వాడుతున్న మౌస్.. కీబోర్డ్ లాంటివి లేకుండా కంప్యూటర్ ను.. స్మార్ట్ డివైజ్ లను కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది.

ఈ వైర్ లెస్ బ్రెయిన్ టెక్నాలజీతో మనిషి జీవితాన్ని మరింత సులభతరంగా చేసేందుకే ఈ ప్రయోగాలను చేపడుతున్నా ఎలాన్ మాస్క్ పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే మరో ఆరు నెలల్లో ఈ న్యూరాలింక్ చిప్ ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఎలాన్ మాస్క్ తాజాగా ప్రకటించారు. ఈ నేపథ్యంల న్యూరాలింక్ చిప్ లు మనిషిపై ఎలాంటి ఫలితాలను ఇస్తాయనేది మాత్రం వేచి చూడాల్సిందే..!



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.