Begin typing your search above and press return to search.

ఇలాంటి జంటను చూసి ఉండరు..నగ్నంగా ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు

By:  Tupaki Desk   |   16 March 2021 5:00 AM GMT
ఇలాంటి జంటను చూసి ఉండరు..నగ్నంగా ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు
X
ప్రపంచాన్ని చుట్టేయాలని..కొత్త ప్రదేశాల్ని చూడాలన్న కోరిక అందరిలోనూ ఉంటుంది. కానీ.. సాధ్యం కాదు. ప్రపంచాన్ని చుట్టేసేందుకు ప్రతిబంధకంగా కెరీర్.. ఆర్థిక అంశాలు కీలకంగా ఉంటాయి. అయితే.. ఇలాంటి ఇబ్బందులేమీ లేని బెల్జియంకు చెందిన ఒక జంట (నిక్, లిన్స్ కార్టే) ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడే ఒక ప్రత్యేకత ఉంది. ప్రపంచ పర్యటన చేసేటోళ్లు చాలామందే ఉంటారు. కానీ.. ఈ జంట ఇస్పెషల్. అదేమంటే.. వీరు ప్రపంచాన్ని నగ్నంగా తిరిగి రావాలన్న కాన్సెప్టు తీసుకొని తమ టూర్ ను స్టార్ట్ చేశారు.

అర్థనగ్నంగా బయటకు రావాలంటేనే సిగ్గుతో చితికిపోయేటోళ్లు కొందరుంటే.. భయంతో నో చెప్పేసేటోళ్లు మరికొందరు. ఈ జంట మాత్రం అలాంటివి అస్సలు పట్టించుకోరు. తాము ఎక్కడికి వెళ్లినా సరే.. నగ్నంగా తిరగటం వీరికి ఇష్టం. అంతేకాదు.. తమ టూర్ కు సంబంధించిన న్యూడ్ ఫోటోల్ని (కళాత్మకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు) ఇన్ స్టాలో పోస్టు చేస్తున్నారు. మిగిలిన వారికి భిన్నంగా ఉన్న ఈ న్యూడ్ కఫుల్ తక్కువ కాలంలో ఫేమస్ అయ్యారు.

వీరు పోస్టు చేసే ఫోటోల్ని మిలియన్ల మంది నిత్యం చూసేస్తున్నారు. దీంతో.. వీరికి ఆదాయం కూడా భారీగా వస్తోంది. నగ్నత్వాన్ని ముడిసరుకుగా చేసుకొని చెలరేగిపోతున్న ఈ జంట ప్రయాణాన్ని వేలాది మంది నిత్యం ఫాలో కావటం గమనార్హం. ఇక.. ఈ జంట విషయానికి వస్తే.. పన్నెండేళ్లుగా వీరు పెళ్లి చేసుకోకుండా లివింగ్ రిలేషన్ లో ఉన్నారు. నేకేడ్ వండరింగ్ అనే ఇన్ స్టాగ్రామ్ పేజీ ద్వారా తమ న్యూడ్ టూర్ చిత్రాల్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తున్నారు. మరి.. జర్నీ టైంలో కూడా బట్టలు ఉండవా? లాంటి సందేహాలు అక్కర్లేదు. ప్రయాణ వేళ బట్టలు వేసుకునే వీరు.. టూరిస్టు స్పాట్ కు వెళ్లిన దగ్గర నుంచి ఒంటిమీద బట్టల్నివిప్పి.. ఓ పక్కన పడేసి ఫోటోలు తీసుకొని అప్ లోడ్ చేస్తుంటారు. తమను ఫాలో అవుతున్న వారికి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఎంగేజ్ చేస్తుంటారు. అన్నట్లు.. వీరింకా ఇండియా రాలేదు. ఎందుకంటే.. మన చట్టాలు ఇలాంటి వాటిని ఒప్పుకోవు సరికదా.. న్యూసెన్స్ కేసు బుక్ చేసే అవకాశం ఉంది.