Begin typing your search above and press return to search.
దేశంలోకి కొత్త నాణెం.. ఏంతో తెలుసా?
By: Tupaki Desk | 7 March 2019 10:18 AM GMTమోడీ గద్దెనెక్కగానే వ్యవస్థలో ఏమైనా మార్పులు వచ్చాయంటే అది కరెన్సీలోనే.. పెద్ద నోట్లు రద్దు చేసి కొత్తగా 100, 200, 500, 2000 నోట్లను ప్రవేశపెట్టారు. అంతేకాదు.. 10 రూపాయల నుంచి 50 రూపాయల వరకూ అన్నీ కొత్తనోట్లను ప్రవేశపెట్టి నోట్లలో బీజేపీ ముద్రను వేశారు.
ఇక కరెన్సీతోనే మోడీ ప్రభుత్వం ఆగడం లేదు. తాజాగా దేశీయ మార్కెట్ లోకి కొత్త రూ.20 నాణెన్ని ప్రవేశపెడుతోంది. త్వరలోనే దీన్ని విడుదల చేయనున్నట్లు ఆర్థిక శాఖ, ఆర్బీఐ ప్రకటించింది.
ప్రస్తుతం చెలామణీలో ఉన్న రూ.10 నాణెన్ని పోలి ఉండేలా కొత్త రూ.20 నాణెన్ని రూపొందించారు. 10 నాణెం 27మిల్లీ మీటర్ల వ్యాసంతో ఉంటే.. రూ.20 నాణెంకు మాత్రం 12 అంచులు ఉంటాయని ఆర్థిక శాఖ నోటిఫికేషన్ లో తెలిపింది. నాణెంపై చివర్లో ఎలాంటి డిజైన్లు పెట్టలేదు.
రూ.20 నాణెంలో రెండు రింగులుంటాయి. ఇందులో వెలుపలి రింగ్ లో 65శాతం రాగి, 15శాతం జింక్, 20శాతం నికెల్ ను ఉపయోగించి తయారు చేశారు. లోపలిరింగ్ ను 75శాతం కాపర్, 20శాతం జింక్, 5శాతం నికెల్ తో రూపొందించారు.
2009 మార్చిలో రూ.10నాణెన్ని విడుదల చేయగా.. కొత్త రూ.20 నాణెం విడుదల తేదీని ప్రకటించలేదు. రూ.10 నాణెలు చెల్లవంటూ ఇప్పటికే మార్కెట్లో తీసుకోవడం లేదు. ఇప్పుడు ఆర్బీఐ కొత్తగా రూ.20 నాణెం తీసుకొస్తుండడంతో దీనిపైనా ఎలాంటి వదంతులు వస్తాయో చూడాలి మరి.