Begin typing your search above and press return to search.
ఎంజే అక్బర్ పై బాంబు లాంటి ఆరోపణ
By: Tupaki Desk | 13 Oct 2018 4:48 AM GMTచేసిన పాపాలు ఊరికే పోవన్న మాటకు తగ్గట్లే.. తాజాగా బయటకు వస్తున్నపెద్దోళ్ల దుర్మార్గాల్ని చూస్తే నోట మాట రాని పరిస్థితి. అక్కడెక్కడో హాలీవుడ్‌లో ప్రారంభమైన మీటూ పుణ్యమా అని.. ప్రముఖుల గుట్లు రట్టు కావటమే కాదు.. వారిలోని చీకటికోణాలు వెలుగుచూసి ఛీ కొట్టించుకుంటున్న వైనం తెలిసిందే.
కాస్త ఆలస్యంగా భారత్‌లో ప్రారంభమైనప్పటికీ.. తాజాగా సంచలనాల మీద సంచలనాలు తెర మీదకు రావటమే కాదు.. ఈ మీటూ పాపానికి పాల్పడిన ఒక ప్రముఖుడు తానున్న కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశం మొండుగా ఉందన్న మాటను చెబుతున్నారు. మీటూపై భారత్ లో కొందరు మాట్లాడినా.. బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా పుణ్యమా అని ఈ ఇష్యూ మరింత రాజుకుంది. ఈ రోజున తెరపైకి వస్తున్న దారుణ ఉదంతాలన్నీ తనుశ్రీ చేసిన ధైర్యం ఫలితంగానేనని చెప్పక తప్పదు.
సీనియర్ పాత్రికేయుడిగా సుపరిచితుడైన ఎంజే అక్బర్ ప్రస్తుతం మోడీ సర్కారులో కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వైనం తెలిసిందే. అందరికి తెలిసిన ఎంజే అక్బర్ లో ఎవరికి తెలీని.. పెద్దగా బయటకు రాని దుర్మార్గమైన కోణం ఒకటి ఉందన్న విషయమే కాదు.. దానికి సంబంధించిన అంశాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
మీటూ ఉద్యమంలో భాగంగా ఎంజే అక్బర్ పై ఇప్పటికే పలు ఆరోపణలు వచ్చి సంచలనంగా మారితే.. దీన్ని పీక్స్ కు తీసుకెళ్లేలా న్యూయార్క్ కు చెందిన మజ్లే డే వున్ కాంప్ అనే మహిళా జర్నలిస్ట్ తాజాగా గళం విప్పారు. తాను పద్దెనిమిదేళ్ల వయసులో ఉన్నప్పుడు ఎంజే అక్బర్ చేతిలో లైంగిక వేధింపులకు గురైనట్లు పేర్కొని పాత బాంబును కొత్తగా పేల్చారు.
ఇంటర్న్ షిఫ్ లో భాగంగా 2007లో ఏషియన్ ఏజ్ పత్రికలో తాను ఉన్నప్పుడు.. ఎంజే అక్బర్ అక్కడే పని చేసేవారని చెప్పారు. ఒక రోజు అక్బర్ తన పట్ల తీవ్ర అభ్యంతరకరంగా ప్రవర్తించారని.. బలవంతంగా ముద్దాడారని ఆరోపించారు. అప్పట్లో అక్బర్ చేతుల్లో లైంగిక వేధింపులకు గురైన విషయాన్ని ఆమె ప్రకటించారు. దీంతో.. ఎంజే అక్బర్ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారిందని చెప్పక తప్పదు.