Begin typing your search above and press return to search.
దేశంలో రోజూ అన్ని వేల మంది జన్మిస్తున్నారా?
By: Tupaki Desk | 3 Sep 2022 7:30 AM GMTదేశంలో ప్రతి సంవత్సరం జనాభా విపరీతంగా పెరుగుతోందని.. అయితే సహజ వనరులు పరిమితంగా ఉన్నాయని.. ఈ నేపథ్యంలో జనాభా నియంత్రణకు ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
అధిక జనాభా సమస్యను సమర్థవంతంగా తగ్గించేందుకు నియమాలు, నిబంధనలు, మార్గదర్శకాలను రూపొందించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. ఈ విషయంలో న్యాయమూర్తులు జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ హృషికేశ్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం ప్రభుత్వం నుండి ప్రతిస్పందనను కోరింది.
ప్రతి సంవత్సరం జనాభా పెరుగుతోందని.. అయితే సహజ వనరులు పరిమితంగా ఉన్నాయని.. పెరిగిపోతున్న జనాభాకు సరిపోయేంత స్థాయిలో వనరులు లేవని అఖిల భారతీయ సంత్ సమితి ప్రధాన కార్యదర్శి దండి స్వామి జీతేంద్రానంద సరస్వతి పిటిషన్ దాఖలు చేశారు.
జనాభా పెరుగుదలతో నిరుద్యోగం, పేదరికంలో విపరీతమైన పెరుగుదల చోటు చేసుకుంటోందని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అందరికీ ఆహార సరఫరా, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు వంటివాటి విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆయన తెలిపారు.
మిలియన్ల మంది ప్రజల జీవన నాణ్యత ప్రమాణాలను ప్రతికూలంగా ప్రభావితం చేసే అనేక తీవ్రమైన సమస్యలకు దారితీసే అత్యంత ముఖ్యమైన కారకాల్లో అధిక జనాభా ఒకటి అని పిల్ లో పేర్కొన్నారు.
ప్రస్తుతం భారత్ జనాభా 139 కోట్లు అని, ఇది ప్రపంచ జనాభాలో 17.8 శాతం అని పిటిషన్‌లో దండి స్వామి జీతేంద్రానంద ప్రస్తావించారు. కానీ దేశంలో వ్యవసాయ భూమి 2 శాతమే ఉందన్నారు. అలాగే తాగునీరు 4 శాతమే ఉందన్నారు. అమెరికాలో రోజుకు 10,000 మంది చిన్నారులు జన్మిస్తుండగా.. భారత్‌లో రోజుకు 70,000 మంది పుడుతున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.