Begin typing your search above and press return to search.
పెళ్లైన 20 రోజులకే భర్తను చంపిన నవ వధువు !
By: Tupaki Desk | 12 Sep 2020 1:00 PM GMTపెళ్లి జరిగి కేవలం 20 రోజులే అయ్యింది. ఇంకా గుమ్మానికి కట్టిన మామిడి తోరణాలు కూడా పూర్తిగా విప్పలేదు. ఆ లోపే అత్తారింట్లో అడుగుపెట్టిన ఓ అనాథ యువతి, భర్త వికృత చేష్టలతో విసిగిపోయింది. పెళ్ళైన మొదటిరోజు నుండి ఫుల్ గా తాగొచ్చి వేధింపులకు గురిచేశాడు. మందు తాగొద్దు అని ఎన్నిసార్లు వేడుకున్నా, ఫలితం లేకుండాపోయింది. ఎన్నో కలలుగన్నా ఆమె బంగారు కలల సౌధం.. ఆమె భర్త వేధింపులను అవిరైపోయింది. భర్త శాడిజాన్ని భరించలేకపోయింది. తీవ్ర ఆవేశంలో రోకలిబండతో తలపై గట్టిగా బాదేసింది.
ఆ దెబ్బకి ఉన్నచోటే కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించేలోపే అనంతలోకాలకు వెళ్లిపోయాడు. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన అస్లామ్ , డెయిలీ ఫర్నీచర్ వర్కర్. ఇటీవలే సమీమ్ అనే ఓ అనాథ యువతితో వివాహం జరిపించారు కుటుంబసభ్యులు. పెళ్లయి 20 రోజులే అయ్యింది. నిత్యం భర్త ఫుల్‌గా తాగొచ్చి గొడపడుతుండటంతో సమీమ్ భరించలేకపోయింది. 20 రోజుల్లోనే నరకం అంటే ఏమిటో చూపించాడు. భర్త పెట్టే టార్చర్ తో విసిగిపోయింది. ఇదే క్రమంలో గురువారం రాత్రి భార్యభర్తల మధ్య గొడవ జరిగింది.
ఆవేశంలో సమీమ్ పక్కనే ఉన్న రోకలిబండతో అస్లామ్ తలపై బాదేసింది. దీంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఈ సంఘటనపై టప్పాచబుత్ర పోలీసులు కేసు నమోదు చేశారు. భర్తను హత్య చేసిన సమీమ్ ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. భర్త తాగొచ్చి టార్చర్ పెట్టడంతో క్షణికావేశంలో రోకలి బండతో కొట్టినట్టు పోలీసులు వెల్లడించారు. అస్లాం భార్య సమ్రిన్ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది.