Begin typing your search above and press return to search.

వేముల‌వాడ టీఆర్ఎస్ టిక్కెట్ రేసులో కొత్త క్యాండెట్‌...!

By:  Tupaki Desk   |   9 Dec 2021 7:41 AM GMT
వేముల‌వాడ టీఆర్ఎస్ టిక్కెట్ రేసులో కొత్త క్యాండెట్‌...!
X
టీఆర్ఎస్ త‌ర‌పున వేముల‌వాడ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో కొత్త ముఖం బ‌రిలో ఉండ‌నుందా.. ఇక్క‌డి నుంచి వ‌రుస‌గా రెండు సార్లు గెలిచిన ర‌మేశ్‌బాబు ఎన్నిక‌పై వివాదం నేప‌థ్యంలో ఆ పార్టీ ఆలోచ‌నా విధానం మారిందా.. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన సీనియ‌ర్ నేత చ‌ల్మెడ ల‌క్ష్మీన‌ర‌సింహారావును ఆ అదృష్టం వ‌రించ‌నుందా.. ప్ర‌స్తుత ప‌రిస్థితులు చూస్తుంటే పార్టీ శ్రేణుల్లో ఇవే అనుమానాలు క‌లుగుతున్నాయి.

2014, 2018 ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌ త‌ర‌పున గెలిచిన చెన్న‌మ‌నేని ర‌మేశ్‌బాబు పౌర‌స‌త్వం వివాదంలో ఉండ‌డం.. కోర్టులో కూడా కేసు న‌డుస్తుండ‌డంతో టీఆర్ఎస్ త‌న దృక్ప‌థాన్ని మార్చుకున్న‌ట్లు తెలుస్తోంది. వేముల‌వాడ నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కు బ‌ల‌మైన అభ్య‌ర్థి కోసం చాలా రోజుల నుంచి వేట సాగిస్తోంది. ఇదే అదునుగా భావించిన కాంగ్రెస్ సీనియ‌ర్ నేత చ‌ల్మెడ ఈ సీటుపై క‌న్నేశారు. కాంగ్రెస్‌లో ఎలాంటి ఎదుగుద‌ల క‌నిపించ‌క‌పోవ‌డం.. రేవంత్ వ‌చ్చినా పార్టీ ప‌రిస్థితిలో మార్పు రాక‌పోవ‌డంతో టీఆర్ఎస్ లో చేరిక‌కు మార్గం సుగ‌మం చేసుకున్న‌ట్లు స‌మాచారం.

తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, క‌రీంన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జి చ‌ల్మెడ ల‌క్ష్మీన‌ర‌సింహారావు ఆ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు. రెండు సార్లు క‌రీంన‌గ‌ర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆయ‌న గులాబీ కండువా క‌ప్పుకోవ‌డంతో నియోజ‌క‌వ‌ర్గంలో స‌మీక‌ర‌ణాలు మారే అవ‌కాశం ఉంద‌ని పార్టీ వ‌ర్గాలు భావిస్తున్నాయి. మాజీ మంత్రి చ‌ల్మెడ ఆనంద‌రావు కుమారుడిగా పేరు తెచ్చుకున్న ల‌క్ష్మీన‌ర‌సింహారావు కు నియోజ‌క‌వ‌ర్గంలో గ‌ట్టి ప‌ట్టు ఉంది.

ప్రైవేటు వైద్య క‌ళాశాల య‌జ‌మానిగా, వెల‌మ సామాజికవ‌ర్గానికి రాష్ట్ర‌, జాతీయ స్థాయి నాయ‌క‌త్వం వ‌హించిన వ్య‌క్తిగా పేరుంది. దీన్ని గుర్తించిన గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ స్వ‌యంగా ఆయ‌న తండ్రితో మాట్లాడి చ‌ల్మెడ‌ను పార్టీలో చేరేలా ఒప్పించారు. ఇదిలా ఉంటే చ‌ల్మెడ ల‌క్ష్మీన‌ర‌సింహారావు కుటుంబం క‌రీంన‌గ‌ర్‌లో స్థిర‌ప‌డినా స్వ‌గ్రామం వేముల‌వాడ నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో పార్టీ టికెట్ ఇక్క‌డి నుంచే సాధించేలా స‌న్నాహాలు చేసుకుంటున్నారు. క‌రీంన‌గ‌ర్ ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో టికెట్ ఆశించినా అది నెర‌వేరేలా లేదు.

ఎందుకంటే ఇప్ప‌టికే మాజీ ఎంపీ వినోద్ కుమార్‌, ప్ర‌స్తుత మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ ఉండ‌డంతో క‌రీంన‌గ‌ర్ నుంచి ఆయ‌న ప్ర‌య‌త్నం స‌ఫ‌లం అయ్యేలా లేదు. అందుకే వేముల‌వాడ నియోజ‌క‌వ‌ర్గాన్ని సేఫ్ జోన్‌లా భావిస్తున్నారు. నిజంగానే ఆయ‌న టికెట్ హామీతోనే పార్టీలో చేరారా..? టీఆర్ఎస్ ఆయ‌న‌ను పార్టీ సేవ‌ల‌కు ప‌రిమితం చేస్తుందా..? లేక క‌రీంన‌గ‌ర్ పార్ల‌మెంటు లేదా అసెంబ్లీ స్థానాల్లో ఏదో ఒక చోట స‌ర్దుబాటు చేస్తుందా వేచి చూడాలి