Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సీజేలు.. ఏపీకి ఎవరంటే ?

By:  Tupaki Desk   |   9 Oct 2021 1:11 PM GMT
తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సీజేలు.. ఏపీకి ఎవరంటే ?
X
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులను నియమించింది . తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌ గా సతీశ్ చంద్రశర్మ నియమితులవ్వగా.. ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌ గా ప్రశాంత్ కుమార్ మిశ్రా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శనివారం ఉత్తర్వులు ఇచ్చారు. కాగా, ఎనిమిది హైకోర్టుకు నూతన ప్రధాన న్యాయమూర్తుల పేర్లను సిఫారసు చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సెప్టెంబర్ 21న కేంద్రానికి సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. అప్పుడే తెలంగాణ హైకోర్టుకు జస్టిస్ సతీశ్‌‌చంద్ర శర్మ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన సీజేగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ సారథ్యంలోని కొలీజియం సిఫారసు చేసింది.

సెప్టెంబర్ 16న సమావేశమైన కొలీజియం ఈ మేరకు సిఫారసులు చేసినట్టు తాజాగా సుప్రీంకోర్టు కొలీజియం వెబ్‌ పేజ్‌ లో పేర్కొంది. మొత్తం 8 హైకోర్టులకు నూతన సీజేల పదోన్నతితోపాటు, ఐదు హైకోర్టుల సీజేలు, 17 మంది హైకోర్టు న్యాయమూర్తుల బదిలీకి సిఫారసులు చేసింది. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ప్రకాశ్ శ్రీవాస్తవ కర్ణాటక హైకోర్టు సీజేగా, బాంబే హైకోర్టు జస్టిస్ రంజిత్ వీ మోరెను మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి అరవింద్ కుమార్‌ను గుజరాత్ హైకోర్టు సీజేగా పదోన్నతి కల్పిస్తూ సిఫారసు చేసింది.