Begin typing your search above and press return to search.

కర్ణాటకకు మళ్లీ సీఎం రాబోతున్నారా?

By:  Tupaki Desk   |   1 Dec 2021 2:30 AM GMT
కర్ణాటకకు మళ్లీ సీఎం రాబోతున్నారా?
X
దేశంలో బీజేపీ రాజకీయాలు ఎవరికి అర్థం కావు.. పైన టాప్ 2 పొజిషన్ ఎప్పటికీ మారదు.. పైన మోడీ ఉంటాడు.. కింద అమిత్ షా ఉంటాడు. ఏమాత్రం తేడా కొట్టినా.. వ్యతిరేకత వచ్చినా కింద ఉన్న కేంద్రమంత్రులు, రాష్ట్రాల సీఎంలు ఎగిరిపోతారు.. అమిత్ షా, మోడీల దెబ్బకు ఇప్పటికే సీనియర్ బీజేపీ నేతలకు వృద్ధాశ్రమాలు దక్కగా.. పోయిన కేబినెట్ విస్తరణలో ఉన్న బీజేపీ పెద్దలు తప్పుకున్నారు.

ఇక రాష్ట్రాల విషయానికి వస్తే గుజరాత్, కర్ణాటక సహా రాష్ట్రాల సీఎంలను అసమ్మతి పేరుతో మార్చేసిన మోడీషాల అధిష్టానం ఇప్పుడు ఎవరిని తమకు ప్రత్యామ్మాయంగా ఎదిగేందుకు అస్సలు ఇష్టపడడం లేదు. అందుకే కాస్త పేరు పరపతి సంపాదించిగానే ఆ సీఎంలను మార్చేస్తుంటారు.

బీజేపీ పాలనలో ముఖ్యమంత్రి కుర్చీ అన్నది టెంపరరీ అన్ని అందరికీ అర్థమైపోయింది. ఎంత కాలం ఎవరు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటారో ఎవరూ చెప్పలేకపోతున్నారు. కర్ణాటక, ఉత్తరాఖండ్ లోనూ ఇదే పరిస్థితి తయారైంది.

కర్ణాటకలో 75 ఏళ్లు దాటిన యడ్యూరప్పను అవినీతి ఆరోపణలతో ఇంటికి పంపిన బీజేపీ అధిష్టానం బొమ్మైను కర్ణాటక సీఎంను చేసింది. తాజాగా బొమ్మై సీటుకు కూడా ఎసరు వచ్చినట్టు తెలుస్తోంది. బొమ్మై మంత్రివర్గంలో కీలక సభ్యుడిగా ఉన్న కేఎస్ ఈశ్వరప్ప పెద్ద బాంబే పేల్చాడు. తొందరలోనే బొమ్మై స్థానంలో మురుగేష్ నిరానీ సీఎంగా బాధ్యతలు తీసుకోబోతున్నట్టు చెప్పి సంచలనం సృష్టించాడు.

మురుగేష్ నిరాసీ కూడా బొమ్మై కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు. నిరానీ కూడా మొన్న బొమ్మై స్థానంలో సీఎంగా అవ్వడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అయితే సామాజిక కూర్పు, సీనియారిటీ తదితర అంశాలను అనేకం బేరిజు వేసుకున్న తర్వాత చివరకు బొమ్మైనే సీఎంను చేశారు మోడీ షాలు.

అయితే బొమ్మై సీఎం కావడం మంత్రుల్లో చాలా మందికి ఏమాత్రం ఇష్టం లేదు. తాజాగా మంత్రుల్లోని అగ్రనేతల తరుఫున దూతలుగా వచ్చిన నేతలు ఏమీ చెప్పి నోరు మూయించారో ఎవరికి తెలీదు.. అయితే బొమ్మై సీఎం కుర్చీలో కూర్చొని రెండు నెలలు కాకుండానే తొందరలోనే ముఖ్యమంత్రి మార్పని బాహాటంగానే సీనియర్ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప చెప్పటమంటే మామూలు విషయం కాదు. తొందరలోనే సీఎంను మార్చబోతున్నారంటూ ఓ మంత్రి బాహాటంగానే చెప్పడంతో ఈ సీఎం మార్పు ఊహాగానాలకు బలం చేకూరుతోంది. కాబోయే సీఎం నిరానీయే అని ఆయనకు అన్నీ అర్హతులున్నట్లు ఈశ్వరప్ప చెప్పారు.