Begin typing your search above and press return to search.
ప్రభుత్వ ఉద్యోగులలో కొత్త ఆందోళన ?
By: Tupaki Desk | 27 Jan 2022 11:30 AM GMTప్రభుత్వ ఉద్యోగులు ఇపుడు ఎటూ ఆందోళనలోనే ఉన్నారు. వారు తమకు పాతా పీయార్సీ మేరకే జీతాలు కోరుకుంటున్నారు. అదే విధంగా లోపభూయిష్టం, నష్టదాయకం అయిన కొత్త పీయార్సీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హెచ్ఆర్ఏలో కోత పెట్టడమే కాకుండా అన్ని విధాలుగా ఆర్ధిక ప్రయోజనాలను దెబ్బతీశారని వారు మండిపడుతున్నారు. కొత్త పీయార్సీ అమలు అయితే తమకు ఆర్ధికంగా భారీ నష్టం చేకూరుతుంది అని వారు లెక్కలతో సహా వివరిస్తున్నారు.
అయితే ప్రభుత్వం మాత్రం అదేమీ లేదని అంటోంది. కొత్త పే స్లిప్స్ ని చూసి చెప్పాలని అంటోంది. జీతాలలో పెరుగుదల ఉంటుందని నిబ్బరంగా చెబుతోంది. అయితే టోటల్ గా ప్యాకేజీ రూపంలో కాకుండా విడివిడిగా చూస్తే అనేక రకాలైన ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ని ఎగరగొట్టారు అన్నదే ఉద్యోగుల ఆవేదన. దాంతో వారు కచ్చితమైన డిమాండ్ పెడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త పీయార్సీని రద్దు చేయాలని, అలాగే జీవోలను కూడా రద్దు చేయాలని అంటున్నారు.
ఇక్కడే పీటముడి పడిపోయింది. ప్రభుత్వం అయితే కొత్త పీయార్సీ మేరకే జీతాలు చెల్లిస్తామని అంటోంది. ఈ మేరకు ఆర్ధిక శాఖ ట్రెజరీ ఉద్యోగుల మీద వత్తిడి పెడుతోంది. ట్రెజరీ పే అండ్ అకౌంట్స్ కార్యాలయాలకు ఆర్ధిక శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దాన్ని పాటించమని ఉద్యోగులు స్పష్టం చేయడంతో లేటెస్ట్ గా మరో సర్క్యులర్ కూడా జారీ చేశారు. ఈసారి కాస్తా కఠినంగా ఆ సర్క్యులర్ ఉందని చెబుతున్నారు.
ప్రభుత్వ ఉత్తర్వులను బే ఖాతరు చేయడానికి వీలు లేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. చెప్పిన టైమ్ నాటికల్లా కొత్త పీయార్సీ మేరకు వేతనాలు ప్రాసెస్ చేయాలని కూడా కోరింది. సచివాలయ శాఖలు, శాఖాధిపతులు, ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్ కార్యాలయాలకు ఆర్థిక శాఖ సర్క్యులర్ జారీ చేసిన మెమో బట్టి చూస్తే ఒక విధంగా ప్రభుత్వం ఏం చేయదలచుకున్నదీ అర్ధమవుతోంది.
జీవోలకు వ్యతిరేకంగా ఎవరూ వ్యవహరించరాదని, నిబంధలనలు ఎవరూ అతిక్రమించరాదని కూడా కోరుతోంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల సంగతి ఏమో కాదీ ట్రెజరీ ఉద్యోగులు మాత్రం విపతీరమైన వత్తిడిని ఎదుర్కొంటున్నారు. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్న చందంగా వారి పరిస్థితి తయారైంది అంటున్నారు. తాము పాత పీయార్సీ మేరకే జీతాలు ఇస్తామని అంటూంటే ప్రభుత్వం గట్టిగానే ఉంటోంది. అలా కాకుండా కొత్త పీయార్సీ మేరకు జీతాలు ఇస్తే ఇక ప్రభుత్వ ఉద్యోగుల సమ్మెకే ఏకంగా గండి కొట్టినట్లుగా ఉంటుంది. దీంతో ఏ చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.
ఇక మరో వైపు సమ్మెకు చూస్తే పది రోజుల టైమ్ ఉంది. అప్పటివరకూ ఉద్యోగులు విధులలో ఉన్నట్లే లెక్క. తాము విధులలో ఉంటూ ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించడం అంటే అది పెద్ద సాహసమే అవుతుంది. మరి అలా కాకుండా మధ్యేమార్గం ఏముందా అని వారు ఆలోచిస్తున్నారు. ఈ రకమైన వత్తిడులతో కొత్త పే స్కేల్ మేరకే జీతాలు వస్తాయా అన్న గుబులు అయితే ఉద్యోగ వర్గాలలో ఉందిట. చూడాలి మరి ఏం జరుగుతుందో.